ముంబై: భారతదేశపు అగ్రగామి ఆన్`డిమాండ్ కన్వీనియన్స్ ప్లాట్‌ఫామ్ అయిన స్విగ్గీ మెరుగైన కస్టమర్ సపోరట్ కోసం రెండు ప్రత్యేకమైన ఫీచర్లను ప్రవేశపెట్టడం ద్వారా ఆహార భద్రత పట్ల తన నిబద్ధతను ఈరోజు పునరుద్ఘాటించింది. ఆహార భద్రతకు సంబంధించిన ఏవైనా సమస్యలను తెలియజేయడానికి వినియోగదారుల కోసం స్విగ్గీ ఒక ప్రత్యేక 24ª÷7 హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. వినియోగదారులు 7948231850 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చు. దీనికి అదనంగా, స్విగ్గీ తన యాప్‌లోని హెల్Î సెక్షన్లో ఒక ప్రత్యేక ‘ఫుడ్ సేఫ్టీ’ ఛానెల్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులకు వారి ఆర్డర్లకు సంబంధించిన సమస్యలను తెలియజేయడానికి స్పష్టమైన, సులభమైన మార్గాన్ని అందిస్తుంది. యాప్‌లోని ప్రత్యేక విభాగంలో, వినియోగదారులు తమ సమస్యలను ఒక చిన్న సందేశం ద్వారా షేర్ చేసుకోవచ్చు మరియు సంబంధిత చిత్రాలను అప్లోడ్ చేయవచ్చు. తమ ఫిర్యాదు స్థితిని తెలుసుకోవడానికి వినియోగదారులకు ఒక టికెట్ నంబర్ లభిస్తుంది. ఆహార భద్రతకు సంబంధించిన సమస్యను నివేదించడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్‌కు కాల్ చేసే వినియోగదారులకు, వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక లింక్ కూడా వస్తుంది, దాని ద్వారా వారు సమస్యకు సంబంధించిన అదనపు సమాచారం, చిత్రాలను షేర్ చేసుకోవచ్చు. ఈ రెండు సందర్భాలలోనూ, స్విగ్గీ ఫుడ్ సేఫ్టీ అస్యూరెన్స్ టీమ్, లేవనెత్తిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో సమీక్షించి, అవసరమైన చర్య తీసుకుంటుందని స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సిద్ధార్థ్ భకూ అన్నారు.


