Wednesday, February 18, 2026
Homeవ్యాపారంహెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో సిట్రియోన్‌ ఇండియా భాగస్వామ్యం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో సిట్రియోన్‌ ఇండియా భాగస్వామ్యం

- Advertisement -

న్యూదిల్లీః వాహన యాజమాన్యాన్ని సులభతరం చేయడం, కస్టమర్‌లు, డీలర్‌లకు ఆర్థిక ప్రాప్యతను పెంచడం అనే ఉమ్మడి దృష్టితో, సిట్రోయెన్‌ ఇండియా భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది అత్యుత్తమ రిటైల్‌, డీలర్‌ ఫైనాన్స్‌ పరిష్కారాలను అందిస్తుంది. ఈ వ్యూహాత్మక చర్య స్టెల్లాంటిస్‌ హెచ్‌డీఎఫ్‌సీ కూటమిని మరింత బలోపేతం చేస్తుంది. దీని వలన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ భారతదేశంలోని జీప్‌, మసెరటి, ఇప్పుడు సిట్రోయెన్‌తో సహా అన్నిస్టెల్లాంటిస్‌ బ్రాండ్‌లకు ప్రత్యేకమైన ప్రాధాన్యత గల ఫైనాన్షియర్‌గా మారింది. స్టెల్లాంటిస్‌ ఇండియా, స్ట్రాటజిక్‌ పార్టనర్‌షిప్స్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బిజినెస్‌ హెడ్‌ అండ్‌ డైరెక్టర్‌ శిశిర్‌ మిశ్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆటోలోన్స్‌, ఇన్వెంటరీ ఫైనాన్స్‌, టూ-వీలర్‌లోని బిజినెస్‌ హెడ్‌ అఖిలేష్‌ కుమార్‌ రాయ్‌ ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు