Homeఅందుబాటులో నరవణె పుస్తకం

అందుబాటులో నరవణె పుస్తకం

- Advertisement -

మాజీ సైన్యాధిపతి అబద్ధం చెప్పరు: రాహుల్ గాంధీ

న్యూదిల్లీ: సైనిక దళాల మాజీ ప్రధానాధికారి ఎంఎం నరవణె రచించిన పుస్తకం ‘ఇప్ప్పుడు అందుబాటులో ఉంది’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ జ్ఞాపకాల ప్రచురణ ఇంకా జరగలేదని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా చేసిన వాదనను తిప్పికొట్టడానికిగాను నరవణె డిసెంబరు 2023 సోషల్ మీడియా పోస్ట్‌ను మంగళవారం ఆయన ఉదహరించారు. పార్లమెంటు భవన సముదాయంలో రాహుల్‌గాంధీ విలేకరులతో మాట్లాడుతూ ప్రచురణకర్త కంటే ఆర్మీ మాజీ చీఫ్‌ను తాను నమ్ముతున్నానని అన్నారు. రాహుల్ గాంధీ నరవణె చేసిన పోస్టు చదివి వినిపించారు. ‘అది హలో ఫ్రెండ్స్. నా పుస్తకం ఇప్ప్పుడు అందుబాటులో ఉంది. లింక్‌ను అనుసరించండి. సంతోషంగా చదవండి. జై హింద’ అని నరవణె ఎక్స్‌లో పేర్కొన్నారని గుర్తుచేశారు. ‘ఇది మిస్టర్ నరవణె చేసిన ట్వీట్. పుస్తకం అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ‘నా ఉద్దేశమేమిటంటే, మిస్టర్ నరవణె అబద్ధం చెబుతున్నాడు లేదా పెంగ్విన్ అబద్ధం చెబుతోంది. ఆర్మీ మాజీ చీఫ్ అబద్ధం చెబుతారని నేను అనుకోను. కానీ ఇద్దరూ నిజం చెప్పలేరు’ అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. ‘పుస్తకం ప్రచురించబడలేదని పెంగ్విన్ చెబుతోంది. పుస్తకం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. జనరల్ నరవణె దయచేసి నా పుస్తకం కొనండి అని 2023లో ట్వీట్ చేశారు. మీరు నరవణె కంటే పెంగ్విన్‌ను నమ్ముతారా? నేను నరవణెను నమ్ముతాను’ అని రాహుల్ తెలిపారు. ప్రభుత్వానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ‘అసౌకర్యకరమైన’ కొన్ని ప్రకటనలను నరవణె పుస్తకంలో పేర్కొన్నారని కాంగ్రెస్ అగ్రనేత ఆరోపించారు. ‘స్పష్టంగా, పెంగ్విన్ నిజం చెబుతోందా లేదా ఆర్మీ మాజీ చీఫ్ నిజం చెబుతున్నారా అని మీరు నిర్ణయించుకోవాలి. అదే సమస్య’ అని రాహుల్ అన్నారు. ప్రతిపక్ష ఎంపీలు తమ నిరసన సందర్భంగా పార్లమెంటు మకర ద్వారం దగ్గర ‘నరేంద్ర లొంగుబాటు’ అని రాసిన పోస్టర్‌ను ప్రదర్శించిన విషయంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి నిరసనగా దీనిని ప్రదర్శించినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు