Homeభారీస్థాయిలో ‘రఫేల’

భారీస్థాయిలో ‘రఫేల’

- Advertisement -

రూ.3.25 లక్షల కోట్ల వ్యయం
ఫ్రాన్స్‌తో రక్షణ ఒప్పందానికి భారత్ సిద్ధం

న్యూదిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌పై జరిపిన దాడుల్లో కీలకంగా మారిన రఫేల్ యుద్ధ విమానాలను భారీస్థాయిలో కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమైంది. ఇందుకోసం ఫ్రాన్స్‌తో అతిపెద్ద రక్షణ ఒప్పందం కుదుర్చుకో నుంది. 3.25 లక్షల కోట్ల వ్యయంతో 114 రఫేల్ యుద్ధ విమానాలు సమకూర్చుకోనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల 18న భారత పర్యటనకు రానుండటంతో ఈ వారమే ఈ ఒప్పందానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ఒప్పందం ఖరారైతే దేశ చరిత్రలో అతి పెద్ద రక్షణ ఒప్పందం అవుతుందని భావిస్తున్నారు. ఇక ప్రపంచంలోనే ఫ్రాన్స్ వెలుపల రఫేల్ విమానాలను అత్యధికంగా నిర్వహించే దేశంగా భారత్ అవతరిస్తుంది. కొనుగోలుకు ప్రతిపాదించిన 114 రఫేల్ యుద్ధ విమానాల్లో 88 సింగిల్ సీటర్ కాగా, 26 ట్విన్ సీటర్ యుద్ధ విమానాలు ఉన్నాయి. కాగా ఇందులో దాదాపు 100 విమానాలను భారత్‌లోనే తయారు చేయడం అత్యంత కీలకాంశం. దీనివల్ల అత్యాధునిక ‘ఫైటర్ జెట్ టెక్నాలజీ’ భారత్‌కు బదిలీ అవుతుంది. వాయుసేన అవసరాల దృష్ట్యా సుమారు 18 విమానాలను ఫ్రాన్స్ నేరుగా ఫ్లై-అవే కండిషన్‌లో అందజేస్తుంది. భారత్ వద్ద ఇప్పటికే 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. 2024 డిసెంబర్‌లో రఫేల్ సి వేరియంట్ భారత వైమానిక దళంలోకి చేరింది. ఆ తర్వాత 26 నేవల్ వేరియంట్లను భారత్ ఆర్డర్ చేసింది. ఇందులో వీ వెర్షన్ విలువ రూ. 63 వేల కోట్లు ఉంటుందని సమాచారం. కొత్త యుద్ధ విమానాలు అందుబాటులోకి వస్తే మొత్తం రఫేల్ విమానాల సంఖ్య 176కు పెరుగుతుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా గత ఏడాది మే నెలలో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర’లో సమయంలో రఫేల్ విమానాలు స్కాల్ప్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇవి సుమారు 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రువుల బంకర్లు లేదా స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేస్తాయి. రఫేల్ యుద్ధ విమానానికి ఉన్న ముఖ్యమైన రక్షణ వ్యవస్థ స్పెక్ట్రా. ఇది శత్రువుల రాడార్లు, లేజర్లు ,క్షిపణుల నుంచి వచ్చే ముప్పులను ముందే గుర్తిస్తుంది. శత్రువుల రాడార్ సిగ్నల్స్‌ను జామ్ చేయడం ద్వారా విమానం ఎక్కడుందో తెలియకుండా మభ్యపెడుతుంది. దీనివల్ల రఫేల్ శత్రువుల కంటికి చిక్కకుండా దాడులు చేయగలదు.
హైదరాబాద్‌లో ఉత్పత్తి కేంద్రం
రఫేల్ యుద్ధ విమానాల తయారీలో ప్రముఖ సంస్థ అయిన దసో ఏవియేషన్, భారత్‌కు చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్ట మ్స్ లిమిటెడ్ మధ్య గత ఏడాది జూన్‌లో నాలుగు చారిత్రాత్మక ఉత్పత్తి బదిలీ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఒక అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతు న్నారు. ఈ తయారీ కేంద్రంలో రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించిన కీలకమైన నిర్మాణ భాగాలను తయారు చేస్తారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు