Homeఅంతర్జాతీయంఇరాన్‌ను వదలొద్దు

ఇరాన్‌ను వదలొద్దు

- Advertisement -

అమెరికాను కోరిన సౌదీ
వాషింగ్టన్: ఇరాన్‌పై మరింతగా దాడులు చేయాలని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వ్యక్తిగతంగా కోరాఉ. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. యుద్ధం నేపథ్యంలో ట్రంప్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, ఇరాన్‌ను గట్టిగా దెబ్బతీయమని ఆయన ట్రంప్‌ను కోరినట్లు వెల్లడించింది. ఇరాన్‌పై యుద్ధం వేళ అరబ్ దేశాధినేతలతో ట్రంప్ మాట్లాడుతున్నారని, ఆయనను సమర్థించే వారిలో సౌదీ యువరాజు ఒకరని శ్వేతసౌధం వర్గాలు పేర్కొన్నాయి. ఇరాన్‌పై దాడులు సాగించేందుకు వినియోగించే యుద్ధ విమానాలకు ఇంధనాన్ని కూడా సౌదీ సమకూరుస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు రావడం గమనార్హం. కొన్నేళ్ల కిందట ఇరాన్‌పై దాడి చేయాలంటూ అమెరికాను సౌదీ రాజు కోరినట్లు కథనం పేర్కొంది. ఇరాన్‌కు ప్రత్యర్థి దేశంగా సౌదీ భావిస్తుంది. పశ్చిమాసియాలో రాజకీయ ప్రభావం, సైనిక శక్తి, మత విభజన వ్యవహారాల్తో ఈ దేశాలు పోటీ పడుతుంటాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు