Homeఉద్యాన పంటలకు రాయలసీమ కేంద్రం

ఉద్యాన పంటలకు రాయలసీమ కేంద్రం

- Advertisement -

. రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్ల పరిశ్రమలు
. ఉన్నత విద్యాశాఖలో 1,523 పోస్టులు
. విద్యుత్ సంస్థల్లో 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
. పెట్టుబడుల ఆకర్షణకు సీఎఫఈ గడువు 6 నెలల పొడిగింపు
. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఏఐపీబీ ఆమోదించిన రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టులతో పాటు ఉద్యోగాల కల్పనకు సంబంధించిన కీలక అంశాలకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిశ్రమలు, సమాచార సాంకేతిక, ఇంధన, ఆరోగ్య, వ్యవసాయ, విద్య, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించిన 45 అజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సచివాలయంలో జరిగింది. ముఖ్యంగా శుద్ధ ఇంధనం, ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, భారీ సోలార్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్, బయోగ్యాస్ యÖనిట్ల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శుద్ధ ఇంధన రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలిపేలా మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడుల ఆమోదంపై చర్చించింది. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈక్విటీ, ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను అందుబాటులోకి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ఎసఎంఈ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను సమాచార, గృహ నిర్మాణశాU మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.
అ పరిశ్రమల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సీఎఫఈ) గడువును 6 నెలలు పొడిగించారు.
అ విజయనగరం, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో వివిధ కంపెనీలకు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది.
అ ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, ఏపీఎస్‌పీడీసీఎల్ కంపెనీల్లో మొత్తం 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నారు.
అ మడకసిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ, వెడల్పు పనులకు రూ.790.38 కోట్ల పరిపాలనా అనుమతులు
అ 2026–27 సంవత్సరానికి కాలువల మెరుగుదల, బలోపేతం కోసం 6502 పనులకు రూ.397.53 కోట్ల నిధులు కేటాయింపు
అ రాయలసీమను ప్రపంచ స్థాయి హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు లక్ష కోట్ల అంచనా వ్యయంతో ‘ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్, ఇందుకోసం కేంద్రం నుంచి రూ.40 వేల కోట్లు, ప్రైవేట్ పెట్టుబడులు రూ.60 వేల కోట్లు వెచ్చించనున్నారు.
అ రాష్ట్రవ్యాప్తంగా 104 మొబైల్ మెడికల్ యÖనిట్ల ద్వారా ప్రతి పౌరుడికి 41 రకాల వైద్య పరీక్షలు.
అ రాష్ట్రవ్యాప్తంగా రూ.149 కోట్లతో ‘సంజీవని’ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.
అ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షకు ప్రతి సంవత్సరం సేవకు 0.5 శాతం వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించారు.
అ వివిధ యÖనివర్సిటీల్లో 1,523 బోధన పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా రాష్ట్ర పబ్లిక్ విశ్వవిద్యాలయాల్లో 1,244 రెగ్యులర్, 279 బ్యాక్‌లాగ్ ఖాళీలు సహా మొత్తం 1,523 బోధన పోస్టులు భర్తీ చేయనుంది. ‘నేషన్ ఫస్ట’ దిశగా పొదుపు చర్యలు చేపట్టాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారిధి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు, ఆయిల్, గ్యాస్ సరఫరా అంతరాయాల నేపథ్యంలో వనరుల సంరక్షణ, దిగుమతి ఇంధన వినియోగం తగ్గింపు, పునరుత్పాదక ఇంధన వినియోగం పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కార్యాచరణ ప్రణాళికకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి పార్థసారధి వివరించారు. సమావేశంలో ఐఅండ్‌పీఆర్ డైరెక్టర్ విశ్వనాథన్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు