Homeఆంధ్రప్రదేశ్ఉల్లాస్ - అక్షర ఆంధ్ర కార్యక్రమంలో వాలంటీర్ టీచర్స్ కు ఒకరోజు శిక్షణా కార్యక్రమం..

ఉల్లాస్ – అక్షర ఆంధ్ర కార్యక్రమంలో వాలంటీర్ టీచర్స్ కు ఒకరోజు శిక్షణా కార్యక్రమం..

- Advertisement -

ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమములో భాగంగా వాలంటీర్ టీచర్లకు ఒకరోజు శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగిందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వయోజన విద్య పర్యవేక్షకులు వెంకటరమణ అక్షర కేంద్రాల నిర్వహణ, వయోజనులకు బోధించే విధానం గురించి వాలంటీర్ లకు శిక్షణ ఇవ్వడం జరిగింది అని తెలిపారు. అదేవిధంగా.ఇంచార్జ్ ఎంపీడీవో అబ్దుల్ నబీ మాట్లాడుతూ ఉపాధిహామీ సిబ్బందితో పాటు వాలంటీర్ లు తమ పరిధిలోని అభ్యాసకులకు 2026 సం: మార్చి నాటికి ప్రాథమిక అక్షరాస్యత, ఆర్ధిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత గురించి బోధించి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు కృషిచేయాలని తెలిపారు. తదుపరి ఏపీవో సుధాకర్ మాట్లాడుతూ ఉపాధిహామీ సిబ్బంది వాలంటీర్ ల సహకారంతో ధర్మవరం మండలంలో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలిపారు. అనంతరం అక్షర ఆంధ్ర వాచకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య పర్యవేక్షకులు వెంకటరమణ, ఏ పీ ఓ సుధాకర్,టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్, అక్షర ఆంధ్ర వాలంటీర్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు