Homeకడుపు కాల్చుకుంటూనేబిడ్డల కడుపునింపి…

కడుపు కాల్చుకుంటూనేబిడ్డల కడుపునింపి…

- Advertisement -

. కుక్‌లు, కమాటీల జీవితాలు దుర్భరం
. మూడు నెలలుగా అందని జీతాలు
. ఏజెన్సీల కమీషన్ల దందా… చేతికందని వేతనం
. పూట గడవక పస్తులు
. బీసీ హాస్టళ్లలో కొత్త తరహా వెట్టిచాకిరీ
. జోక్యం చేసుకోవాలంటూ పాలకులకు వినతి

విశాలాంధ్ర – సచివాలయం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ బిడ్డల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రాష్ట్రంలో బీసీ హాస్టళ్లలో చదువుకునే పిల్లల కడుపు నింపేందుకు ప్రభుత్వం ‘మెనూ’ మార్చింది. నాణ్యమైన భోజనం అందించాలని సంకల్పించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ భోజనాన్ని అమృతంలా వండి వడ్డిస్తున్న కుక్‌లు, కమాటీల జీవితాలు మాత్రం దుర్భరంగానే ఉన్నాయి. “వడ్డించేవాడు మనవాడైతే…” అన్న సామెత వీరికి వర్తించడం లేదు సరే కదా, కనీసం కష్టపడిన కూలి కూడా చేతికి అందక రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. విద్యార్థుల ఆకలి తీరుస్తున్న ఆ చేతులు, తమ సొంత బిడ్డల ఆకలి తీర్చలేక అప్ప్పుల కోసం చేయి చాస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు లేక, కడుపు చేత్తో పట్టుకుని దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన నియామకాలు, ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల ఆయా కుటుంబాల్లో చీకట్లు Å£మ్ముకున్నాయి. గత నవంబరు ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా సుమారు 250 మంది కుక్‌లు, కమాటీలను ప్రభుత్వం ఎసఆరఆర్ ఏజెన్సీ ద్వారా నియమించింది. నెలకు రూ.15 వేల వేతనం నిర్ణయించింది. అయితే, విధుల్లో చేరిన నాటి నుంచి నేటి వరకు ఒక్క రూపాయి కూడా జీతం అందలేదు. సంక్రాంతి పండుగ నాడు కూడా పస్తులతో గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. జీతాల గురించి అడిగితే డీబీసీడబ్ల్యూవోలు, వార్డెన్లు “మాకు సంబంధం లేదు, ఏజెన్సీని అడగండి” అంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానమిస్తున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం రూ.15 వేల జీతం ఇవ్వాల్సి ఉండగా, ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు సమస్య ప్రభుత్వానిది కాదు, ప్రభుత్వం నియమించిన ఎసఆరఆర్ ప్రైవేటు ఏజెన్సీది.ప్రభుత్వం ఇచ్చే రూ.15 వేలలో మాకు దక్కేది కేవలం రూ. ఎనిమిది వేల నుంచి రూ.10 వేలేనని వారు చెబుతున్నారు. సర్వీస్ ఛార్జీల పేరుతో సగం జీతం కోసేయడం ఎంతవరకు న్యాయం అని కుక్‌లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏజెన్సీకి విడిగా మూడు శాతం కమీషన్ ఇస్తుండగా, మళ్లీ పేద కార్మికుల పొట్ట కొట్టి రూ. ఐదు వేలకు పైగా కమీషన్ దండుకోవాలని చూడటం అమానుషమని మండిపడుతున్నారు. గతంలో ఇలాంటి దోపిడీలు జరగకూడదనే ఉద్దేశంతో తెచ్చిన ఆప్కాస్‌ను పక్కన పెట్టి, ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టడం వెనుక ఉన్న మతలబు ఏమిటనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆప్కాస్ ద్వారా కాకుండా ప్రైవేటు ఏజెన్సీలకు ఈ నియామకాలు అప్పగించడం వల్లే ఈ అక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో జరగబోయే మరో 1400 మంది సిబ్బంది నియామకాల్లోనూ ఇదే పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంతృప్తిగా ఉన్నారని సర్వేల్లో తేలింది. మరి ఆ తృప్తి వెనుక ఉన్న కుక్‌ల దీనావస్థ అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన జీతంలో సగం కోత కోస్తామని ఏజెన్సీలు బహిరంగంగా చెబుతున్నా, బీసీ సంక్షేమ శాఖ ఎందుకు మౌనంగా ఉంది అన్న విమర్శలు వినవస్తున్నాయి. కేవలం వంట చేయడం, పాత్రలు శుభ్రం చేయడమే తమ విధి అని నియామక పత్రాల్లో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. వార్డెన్లు తమతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని, మరుగుదొడ్లు కడిగించడం, హాస్టల్ పరిసరాలు శుభ్రం చేయించడం వంటి పనులు కూడా బలవంతంగా చేయిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. ప్రశ్నిస్తే “నచ్చితే పని చేయండి, లేదంటే మానేయండి” అంటూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైట్ డ్యూటీల పేరుతో అదనపు బాధ్యతలు మోపుతూ, ఏ చిన్న తప్ప్పు జరిగినా తమపై నెట్టేస్తున్నారని వారు భయపడుతున్నారు. బీసీ బిడ్డల కడుపు నింపుతున్న తమ కడుపులు ఆకలితో అలమటిస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కుక్ లు కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, సవిత జోక్యం చేసుకోవాలని, జీతం బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. ఏజెన్సీల దోపిడీని అరికట్టి, పూర్తి వేతనం అందేలా చూడాలని, విధుల విషయంలో స్పష్టమైన నిబంధనలు రూపొందించి, వార్డెన్ల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు