సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం;;భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ములుగు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరంవిగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని, కేంద్ర ప్రభుత్వం రాజకీయ స్వలాభాల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనమంతా ఐక్యతగా పోరాడాలని వారి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్,సహాయ కార్యదర్శులు ఎర్రంశెట్టిరమణ,శ్రీనివాసులు,చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సకల రాజా, పట్టణ నాయకులు,శ్రీధర్, ఆదినారాయణ శ్రీనివాసులు, మహిళా సమాఖ్య లలితమ్మ శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..
- Advertisement -
RELATED ARTICLES


