Homeక్రీడలుచిన్నప్ప్పుడే సంజు భుజం తట్టా: శశిథరూర్

చిన్నప్ప్పుడే సంజు భుజం తట్టా: శశిథరూర్

- Advertisement -

తిరువనంతపురం: అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్ప్పుడు భారత క్రికెటర్ సంజు శ్యాంసన్‌కు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మద్దతుగా నిలిచారు. టీమిండియా యాజమాన్యంపై విమర్శలూ చేశారు. టీ20 ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన సంజు శ్యాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజు శ్యాంసన్ గురించి ఆసక్తికర విషయాలను శశిథరూర్ వెల్లడించారు. సంజుకు 14 ఏళ్ల వయసు ఉన్నప్ప్పుడే తనను కలిశానని, అప్ప్పుడే ‘మరో ధోని’గా అభివర్ణించినట్లు గుర్తుచేశాడు. ఇటీవల ఇదే మాటను ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు చెబితే… సంజు శ్యాంసన్ ఒకేఒక్కడుగా నిలుస్తాడని అన్నాడు. ఇప్ప్పుడా మాటలు గుర్తుచేసుకుంటే నిజమేనని అనిపిస్తోందని థరూర్ వెల్లడించారు. ‘ఓ రకంగా నేను సంజు విషయంలో మామయ్యలా వ్యవహరించానని అనుకుంటా. అతడికి 14 ఏళ్లు ఉన్నప్ప్పుడే నేను కలిశా. అప్పట్నుంచే చాలా ప్రోత్సహించా. అలా చెప్పేందుకు నేనేమీ క్రికెట్‌కు గొప్ప అభిమానిని కాదు కానీ… పధ్నాలుగేళ్ల వయసులోనే సంజు ఏదో సాధిస్తాడని భావించా. మరో ధోని అవుతాడని ఊహించా. అతడికీ అదే మాట చెప్పా. కొన్నేళ్ల తర్వాత ఇదే మాటలను నా మిత్రుడు గౌతమ్ గంభీర్ వద్ద గుర్తుచేసినప్ప్పుడు… ‘సంజు మరెవరికీ ప్రతిరూపం కావాల్సిన అవసరం లేదు. అతడిని అతడిలానే ఉండనిద్దాం. సంజు శ్యాంసన్‌లా ప్రత్యేకంగా నిలుస్తాడు’ అని అన్నాడు. ఇప్ప్పుడు అదే జరిగింది. ప్రశాంతంగా కేవలం ఆట పైనే దృష్టిపెట్టే సంజు శ్యాంసన్‌కు మున్ముందూ మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. తప్పకుండా వన్డేల్లోనూ ఆడించాలి. అతడి గత చివరి వన్డేలో సెంచరీ చేశాడు. ఆ తర్వాత అతడిని తప్పించారు’ అని శశిథరూర్ వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు