Homeఅంతర్జాతీయంట్రంప్‌తో మమ్దానీ రెండో భేటీ

ట్రంప్‌తో మమ్దానీ రెండో భేటీ

- Advertisement -

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ శ్వేతసౌధంలో భేటీ అయ్యారు. ఇది వీరిద్దరి రెండవ సమావేశం. నవంబరులో తొలిసారి భేటీ అయ్యారు. కాగా న్యూయార్క్ నగరంలో నూతన గహాల నిర్మాణానికి భారీ పెట్టుబడులపై మమ్దానీ, ట్రంప్ చర్చించారు. అధ్యక్షుడితో చర్చలు ఫలప్రదంగా సాగినట్లు మమ్దానీ అనంతరం ఎక్స్‌లో పేర్కొన్నారు. న్యూయార్క్‌లో మరిన్ని గహాల నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా, క్వీన్స్‌లోని సన్నీసైడ్ యార్డ్‌లో 12,000 కొత్త ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చేలా మామ్దానీ చేసిన ప్రతిపాదన విషయంలో ట్రంప్ సంతప్తి వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు వ్యయం 21 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. 50 ఏళ్లలో ఇంత భారీగా గహాలు, మౌలిక వసతుల పెట్టుబడులు పెట్టలేదని, ఈ ప్రాజెక్టు 30వేల ఉద్యోగాలు సష్టిస్తుందని మమ్దానీకి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఆనా బహర్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై ట్రంప్ సంతప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు