తెహ్రాన్: ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాకు యుద్ధ నౌకలను పంపుతూ తెహ్రాన్‌పై అమెరికా బెదిరింపులకు పాల్పడుతోన్న సంగతి తెలి సిందే. ఈ క్రమంలో ఇజ్రా యిల్‌లోని అమెరికా రాయబారి అక్కడి దౌత్య అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్లాలని అమెరికా రాయబారి మైక్ హకబీ సూచించారు. ప్రయాణ ఖర్చులను అమెరికా ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. భయమొద్దని, ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడక ముందే ఇజ్రాయిల్ వీడాలని సూచించారు. ఇరాన్‌పై దాడులకు అవకాశాలున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. తమతో అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పబోవని ఆ దేశాన్ని హెచ్చరించారు. అణు చర్చల్లో ప్రతిష్టంభనల క్రమంలో అమెరికా రాయబారి తాజా ఆదేశాలతో పశ్చిమాసియాలో భయాందోళన వ్యక్తమవుతోంది.
ఇజ్రాయిల్ వీడండి: అమెరికా
- Advertisement -
RELATED ARTICLES


