Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌లో భూకంపం

బంగ్లాదేశ్‌లో భూకంపం

- Advertisement -

ఢాకా: బంగ్లాదేశ్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.4గా నమోదైంది. రాజధాని ఢాకాకు 188 కిమీల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. పొరుగున ఉన్న పశ్చిమబెంగాల్‌లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఢాకాలోని అగర్గావ్‌లోని బీఎండీ వాతావరణ కేంద్రానికి నైరుతి దిశలో ప్రకంపనలు సంభవించినట్లు తెలిసింది. భూకంపం 22.45 డిగ్రీల ఉత్తర అక్షాంశం` 89.139 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద, 9.8 కిమీల లోతులో వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు