Homeసినిమా‘డ్రాగన్‌’ షూటింగ్‌పై పుకార్లు వ్యాప్తి చేయొద్దు

‘డ్రాగన్‌’ షూటింగ్‌పై పుకార్లు వ్యాప్తి చేయొద్దు

- Advertisement -

హైదరాబాద్: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రద్దయినట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. ఎన్టీఆర్ లుక్ విషయంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో షూటింగ్ వాయిదా వేశారని ప్రచారం జరిగింది. కాగా చిత్ర నిర్మాణసంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ విషయంలో స్పష్టనిచ్చాయి. షూటింగ్ ప్రణాళికా బద్ధంగానే జరుగుతోందని… హీరో లుక్ కోసం రద్దు కాలేదని… ప్రస్తుతం సన్నద్ధత కోసం కొంత విరామం తీసుకున్నట్లు తెలిపింది. దయచేసి ఎవరూ ఈ ప్రాజెక్ట్‌పై పుకార్లు సృష్టించవద్దని…అనధికారిక సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ఏమైనా మార్పులు ఉంటే తామే తెలియజేస్తామని తెలిపింది. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్… ‘సలార’ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తోన్న చిత్రమిది. ఈ చిత్రానికి ‘డ్రాగన’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్‌కపూర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు