Homeక్రీడలునేనూ తప్ప్పులు చేశానేమో…

నేనూ తప్ప్పులు చేశానేమో…

- Advertisement -

విరాట్, రోహిత్ వివాదంపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్… భారత సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నాయని … వారి మధ్య ఏదో జరుగుతోందని గత కొంతకాలంగా అనేక పుకార్లు షికార్లు చేసిన సంగతి విదితమే. కొన్ని సార్లు అది బహిర్గతం కూడా అయ్యింది. అయితే, విరాట్, రోహిత్‌తో తన సంబంధాలపై గంభీర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంలో తాను కూడా కొన్ని తప్పులు చేసి ఉండవచ్చని అంగీకరించాడు. ‘నేను మనిషినే.. నేను కూడా తప్పులు చేసి ఉండొచ్చు’ అని పేర్కొన్నాడు. సోమవారం కోల్‌కతాలో జరిగిన రెవ్‌స్పోర్ట్జ్ కాంక్లేవ్‌లో గంభీర్ మాట్లాడుతూ… ఆటగాళ్లతో వ్యవహరించే విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఎల్లప్పుడూ మంచి ఉద్దేశంతోనే తీసుకున్నానని తెలిపారు. “నేను కూడా మనిషినే. నేను తప్పులు చేయొచ్చు. ఆటగాళ్లకు కూడా తప్పులు చేసే హక్కు ఉంది. గత 18 నెలల్లో నేను కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. కానీ, నా ఉద్దేశాలు ఎప్పుడూ సరైనవే. మంచి ఉద్దేశ్యంతో తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని అంగీకరించవచ్చు. అయితే, చెడు ఉద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయం మాత్రం డ్రెస్సింగ్ రూమ్‌లో ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు” అని గంభీర్ స్పష్టం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ ముందు నిలబడి ఆటగాళ్ల కళ్లలోకి చూసి నిజాయితీగా మాట్లాడగలిగితేనే కోచ్‌గా తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తున్నట్లని గంభీర్ పేర్కొన్నాడు.
గంభీర్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలలకే విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఈ నిర్ణయం 2024–25లో జరిగిన బోర్డర్గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు నిరాశపరిచిన ప్రదర్శన తర్వాత వచ్చింది. అలాగే న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా భారత్ ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో బీసీసీఐ జట్టు ప్రదర్శనను సమీక్షించి కొన్ని కొత్త మార్గదర్శకాలను అమలు చేసింది. కోహ్లీ, రోహిత్ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత భారత టెస్ట్ జట్టులో మార్పుల దశ ప్రారంభమైంది. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వగా, శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. గంభీర్, గిల్ నాయకత్వంలో భారత్ ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ సిరీస్‌ను డ్రా చేసుకుంది. అలాగే స్వదేశంలో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో జట్టు పరాజయం చవిచూసింది. మరోవైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... భారత జట్టుకు వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. ఇద్దరూ ఐసీసీ క్రికెట్ వన్డే ప్రపంచకప్2027పై దృష్టి సారించారు. అయితే, ప్రపంచకప్ జట్టులో వారి స్థానం ప్రదర్శన ఆధారంగానే నిర్ణయిస్తామని జట్టు మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు