Homeపదవుల పందారం

పదవుల పందారం

- Advertisement -

. 31 నామినేటెడ్‌ పోస్టులకు పేర్లు ఖరారు
. సామాజిక సమీకరణల ఆధారంగా ఎంపిక

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్రంలో వివిధ నామినేటెడ్‌ పదవుల భర్తీకి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాటికి సంబంధించిన కీలక ఆదేశాలను ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. 31 నామినేటెడ్‌ పదవులకు పేర్లను ఖరారు చేసింది. సామాజిక సమీకరణల ఆధారంగా ఎంపిక చేశారు. బీసీలకు పెద్దపీట వేశారు. ఓసీలకు ఆరు, బీసీలు 18, ఎస్సీలు నాలుగు, ఎస్టీ ఒకటి, మైనార్టీలకు రెండు కేటాయించింది. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ కులాల కో ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు టీడీపీ నేత ఆకేపోగు ప్రభాకర్‌ (కొడుమూరుఎస్సీ)కు, రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డును బాల కోటయ్య (నందిగామ -ఎస్సీ), బహుజన జేఏసీ… కమ్మ కార్పొరేషన్‌ను టీడీపీ నేత బ్రహ్మం చౌదరి (గురజాల), బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ను టీడీపీ నేత బుచ్చి రామ్‌ ప్రసాద్‌ (గుంటూరు వెస్ట్‌), ముదలియార్‌ సంక్షేమం… అభివృద్ధి కార్పొరేషన్‌ టీడీపీ నేత సీఎస్‌ త్యాగరాజన్‌, బొందిలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌ టీడీపీ నేత డి.విక్రమ్‌ సింగ్‌, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌ (హెచ్‌డీపీటీ) దాసరి శ్రీనివాసులు (బీజేపీ), ఆంధ్రప్రదేశ్‌ వడ్డీ అభివృద్ధి కార్పొరేషన్‌ను గుంటశాల వెంకట లక్ష్మీ (జేఎస్పీ)కి కేటాయించారు. ఆరెకటిక/ కటిక/ ఆరే, సూర్యవంశీ సంక్షేమ, అభివృద్ధి సంఘాన్ని హరికృష్ణరావు హనుమంతకరి (టీడీపీ), రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ను కమ్మరి పార్వతి (టీడీపీ), రాష్ట్ర కుంచిటి వక్కలిగ, వక్కలిగర, కుంచిటిగ సంక్షేమ, అభివృద్ధి సంఘం లక్ష్మీనారాయణ- మడకశిర (టీడీపీ)కి కేటాయించారు. నగరాలు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ను మరుపిళ్ల తిరుమలేశ్వరరావు (టీడీపీ), రాష్ట్ర పాల, ఏకరి, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నాయని వారు, పాలెగారు, తోలగారి, కవలి సంక్షేమ అభివృద్ధి సంఘాన్ని నాగేశ్వరనాయుడు కందూరి (టీడీపీ), రాష్ట్ర నూర్బాష/ దూదేకుల కార్పొరేషన్‌ను నాగుల్‌ మీరా (టీడీపీ), రాష్ట్ర కురకుల, పొందర సంక్షేమ…అభివృద్ధి సంఘాన్ని నరసింహులు (టీడీపీ)కి కేటాయించారు. దివ్యాంగులు, వృద్ధ పౌరుల సహాయ కార్పొరేషన్‌ను నారాయణ స్వామి (టీడీపీ)కి, కనీస వేతన సలహా బోర్డును పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి (టీడీపీ), మాంసం అభివృద్ధి కార్పొరేషన్‌ను ప్రకాశ్‌ నాయుడు (ఎస్సీ) టీడీపీ, తెలుగు, సంస్కృత అకాడమీని ఆర్డీ విల్సన్‌ (బీజేపీ)కి కేటాయించారు. సగర/ఉప్పర సంక్షేమా భివృద్ధి కార్పొరేషన్‌ను ఆర్‌.వెంకటరమణప్ప (టీడీపీ), నాగవంశం సంక్షేమ… అభివృద్ధి కార్పొరేషన్‌ను రామనారాయణ రావు ఎరుబోతు (టీడీపీ), రాష్ట్ర కాళింగ కోమటి/ కాళింగ వైశ్య సంక్షేమ, అభివృద్ధి సంఘాన్ని రమేశ్‌ (టీడీపీ), సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీని రవి మందలపు (టీడీపీ), ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక కార్పొరేషన్‌ను రెడ్డి అనంత కుమారి (టీడీపీ), బెస్తా సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ను శ్రీధర్‌ బొమ్మన, సూళ్లూరుపేట (ఎస్సీ) టీడీపీకి కేటాయించారు. ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఓయూడీఏ)ను షేక్‌ రియాజ్‌ (జేఎస్పీ), జానపద కళలు, సృజనాత్మకత అకాడమీని వంపూరు గంగులయ్య- పాడేరు (ఎస్టీ) జేఎస్పీకి, రాష్ట్ర వీరశైవ లింగాయత, లింగబలిజ సంక్షేమ, అభివృద్ధి సంఘాన్ని స్వప్న (టీడీపీ), కృష్ణ బలిజ / పూసల సహకార ఆర్థిక కార్పొరేషన్‌ (టీడీపీ), ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జంగం సంక్షేమ, అభివృద్ధి సంఘాన్ని వి.చంద్రశేఖర్‌ (టీడీపీ), ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దాసరి సంక్షేమ, అభివృద్ధి సంఘాన్ని వెంకట రత్నాజీ పొత్నూరు (టీడీపీ)కు కేటాయించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు