69 మంది మృతి – 170 మందికి గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఇస్లామాబాద్, తర్లాయ్ ప్రాంతంలోగల ఖతీజాతుల్ కుర్బా మసీదు`ఇమాంబార్గా కిక్కిరిసిన సమయంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 69 మంది ప్రాణాలు కోల్పోగా, 170 మందికిపైగా గాయపడ్డారు. అయితే ఆత్మాహుతికి సిద్ధమైన వ్యక్తిని ఇమాంబార్గ ప్రవేశం వద్ద అడ్డుకోగా అతను అక్కడికక్కడే ఆత్మాహుతికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మతుల సంఖ్య 31కు చేరుకోగా, గాయపడిన వారు 169 మందికిపైగానే ఉన్నారని జిల్లా అధికారి ఎక్స్‌లో పేర్కొన్నారు. మతులు పెరిగే అవకాశమున్నట్లు తెలిపారు. ఈ దాడికి ఇప్పటివరకు ఏ సంస్థ బాధ్యత తీసుకోలేదు. అయితే ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి విదేశీయుడని, అతనికి తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)తో సంబంధాలు ఉండివుంటాయని పోలీసులు అనుమానిస్తున్నట్లు ఇస్లామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఇర్ఫాన్ నవాజ్ మెమన్ ‘ఎక్స’లో పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, 1122 సహాయక సిబ్బంది రంగంలోకి దిగి అత్యవసర చర్యలు చేపట్టారు. సైన్యం కూడా రంగంలోకి దిగి ఆ ప్రాంతమంతా తనిఖీ చేసింది. ఈ ఘటనతో రాజధాని ప్రాంతంలోని అన్ని ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి నెలకొన్నది. గాయపడిన వారిని పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రులకు తరలిస్తున్న దశ్యాలు మీడియా, సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. కాగా, దాడి జరిగిన వెంటనే పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వద్ద ఎమర్జెన్సీ ప్రకటించారు.
ఇది పరికిపంద చర్య:
ఇది పరికిపంద చర్య అంటూ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిక్ ఫజల్ చౌదరి, సెనేట్ ప్రతిపక్ష నాయకుడు అల్లామా రాజా నసీర్ అబ్బాస్ తదితరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రాణ నష్టం జరగడంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం మానవాళిపై దాడి చేయడమే అంటూ జర్దారీ పేర్కొన్నారు. భద్రతా వైఫల్యమే ఇందుకు కారణమని, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రార్థనా మందిరాలు ఇలాంటి దాడులకు లక్ష్యాలుగా మారకూడదని అబ్వాస్ పేర్కొన్నారు. ఇది మానవాళిపై, మతంపై, సామాజిక విలువలపై ప్రత్యక్ష దాడి అని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటివి ఉపేక్షించరాదని స్పష్టంచేశారు. ఇది ఆత్మాహుతి దాడేనని పోలీసులు తెలిపారు. ఇదిలావుంటే, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీతో పాకిస్థాన్ సైన్యం తలపడుతున్న క్రమంలో పెద్దఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఆత్మాహుతి దాడి ఇటీవల కాలంలో ఇస్లామాబాద్‌లో జరిగిన రెండవ ఘటనగా నిలిచింది. గతేడాది నవంబరులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది చనిపోయారు. బలూచిస్థాన్ వేర్పాటువాదానికి కేరాఫ్‌గా మారిపోయింది. భద్రతా సిబ్బంది, విదేశీయులు లక్ష్యంగా అక్కడి సాయుధ సంఘాలు దాడులు చేస్తుంటాయి. అఫ్గాన్`ఇరాన్‌కు సరిహద్దులో వనరుల నిక్షేపంగా ఉన్న ఈ ప్రాంతం హింసకు కేంద్రంగా ఉండటం పాకిస్థాన్‌కు పెద్ద సమస్యగా మారిపోయింది.


