Homeసాహిత్యంప్రవాసం

ప్రవాసం

- Advertisement -

ఎప్పుడూ అక్కడే
గడపాలని ఆశిస్తుంటాను
చివరికి ఒక్క రోజైనా…
కొన్ని క్షణాలైనా దక్కితే చాలు!
ఎంత వెతికినా ఇక్కడ దొరకదు
ఆ పచ్చని చేలల్లో
వదిలేసి వచ్చిన
ఎర్రచీర జ్ఞాపకం.
కీచురాళ్ల గానమై
ఇప్పటికీ మదిలో
ప్రతిధ్వనిస్తోంది.
వెనక్కి వెళ్లాలని
నేను పట్టుబట్టను.
ఈ నగరం అరణ్యపు
ఊచల మధ్య
బందీగా మారిన నేను,
నవ్వులను మరచిపోయి,
నడకలను మరచిపోయి,
అక్కడి నిశ్శబ్ద ప్రశాంతతను
భరించలేనివాడినయ్యాను.
మళ్లీ కొత్త కలలు కనడానికి
హృదయంలో పేరుకుపోయిన
ఎడారి నిజాలను
మోసుకెళ్లడం తప్ప
వేరే మార్గం లేదు.
అయినా…ఒకప్పుడు ఆస్వాదించిన
ఆ పల్లె జీవితం
సాధారణమైనదేమీ కాదు.
అది మనసులు మరిగి మరిగి,
కన్నులు చెమర్చి,
చివరికి
అశ్రుబిందువై వికసించిన
దు’ఖపు చిరునవ్వు.
మాణిక్యాలరావు పంచదార్ల,
9441754215

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు