Homeసాహిత్యంమహాకవి శ్రీశ్రీ స్మారక కథల పోటీ`2026

మహాకవి శ్రీశ్రీ స్మారక కథల పోటీ`2026

- Advertisement -

నా సాహిత్య స్వర్ణోత్సవ సందర్భంగా నాకు స్ఫూర్తి, ప్రేరణ అయిన మహాకవి శ్రీశ్రీకి చిరు నివాళిగా 2023 లో ప్రారంభించిన ఈ పోటీని ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నాము.
మూడు కథలకు మూడు బహుమతులు.ఒక్కో దానికి రూ.2000/`
అంశాలు: కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.
నియమ నిబంధనలు: 1. ఒక్కో అంశానికీ ఒక్కో బహుమతి అనే నియమం లేదు. బాగుంటే ఒక్క అంశం మీదే రాసినా ముగ్గురికి బహుమతి ఇవ్వవచ్చు.

  1. నవ, యువ, నడి వయసు రచయితలను ప్రోత్సహించడమే ఈ పోటీ ఉద్దేశం గనుక 50 ఏళ్లు దాటని వారికే ఈ పోటీ పరిమితం. గమనించ ప్రార్థన.
  2. ఒకరు ఎన్నికథలనైనా పంపవచ్చు. అనువాదాలు, అనుసరణలు దయచేసి పంపవద్దు.
  3. బహుమతి పొందిన కథలు ‘మా కథలు2025’ సంకలనంలో ప్రచురిస్తారు. ఇందుకు ఆమోదం తెలిపిన సంపాదకులు, ‘సహస్ర కథానిధి’ వాణిశ్రీగారికి ప్రత్యేక కృతజ్ఞత్ఙాóవందనాలు. ఈ కథా సంపుటి 1410`26 న ఆవిష్కరిస్తారు.
  4. ఒక ప్రఖ్యాత సాహితీవేత్త న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారు.
  5. కథ చేతిరాతలో 36 పేజీలు, డిటిపి చేయిస్తే 35 పేజీల మధ్య ఉంటే మంచిది.
  6. ప్రముఖుల సమక్షంలో శాలువా సత్కారం, జ్ఞాపిక ప్రదానం ఉంటాయి.
  7. కథలు పంపుటకు ఆఖరు తేది 20082026. ఫలితాల ప్రకటన 20092026.
  8. 14102026న రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో బహుమతి ప్రదానం ఉంటుంది.
  9. కథలను సింహప్రసాద్ సాహిత్య సమితి, 401, మ్యరి ఎస్టేట్స్‌, ఎం.ఐ.జి2650, కే.పి.హెచ్.బి. కాలనీ, హైదరాబాద్`500072, సెల్: 9849061668 చిరునామాకుగాని, Srisri.Kathalapotee@gmail.comకు గాని పంపించవలెను.
    సింహప్రసాద్, కన్వీనర్
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు