Homeజిల్లాలుఅనంతపురంపబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్' కార్యక్రమంలో అదనపు ఎస్పీలు 109 పిటీషన్లు పై విచారణ

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్’ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు 109 పిటీషన్లు పై విచారణ

- Advertisement -

విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : జిల్లా ప్రజల సమస్యలను చట్టపరిధిలో, అత్యంత వేగంగా పరిష్కరించి వారికి న్యాయం చేయడమే లక్ష్యంగా… జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీలు ఎం.నాగభూషణం, ఎస్ మహబూబ్ బాషాలు సోమవారం జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ‘పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్’ కార్యక్రమంలో 109 పిటీషన్లు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ప్రతి అర్జీదారుడి సమస్యను ఓపికగా విన్నారు.
​కేవలం అర్జీలు తీసుకోవడమే కాకుండా, సమస్య తీవ్రతను బట్టి అదనపు ఎస్పీలు తక్షణమే స్పందించారు. అక్కడికక్కడే ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణమే చట్టప్రకారం విచారణ జరిపి, నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆయా స్టేషన్ల అధికారులను ఆదేశించారు.
​వచ్చిన ప్రతి పిటిషనర్‌కు న్యాయం జరిగేలా చూడటం పోలీసుల ప్రాథమిక బాధ్యత అని ఈ సందర్భంగా అదనపు ఎస్పీలు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో క్షేత్రస్థాయి అధికారులు మరింత జవాబుదారీతనంతో వ్యవహరించాలని, బాధితులను ఇబ్బందులకు గురిచేయకుండా నిర్ణీత సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. పోలీసుల స్పందన, బాధ్యతాయుతమైన తీరు పట్ల అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ​దూర ప్రాంతాల నుండి వచ్చే అర్జీదారుల సౌకర్యార్థం జిల్లా పోలీస్ శాఖ ఇస్కాన్ సంస్థ సహకారంతో భోజన వసతి కల్పించింది. పీజీఆర్‌ఎస్‌కు విచ్చేసిన బాధితులకు, వారి సహాయకులకు పోలీస్ అధికారులు భోజన సౌకర్యాన్ని పర్యవేక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు