ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశాం. డీఎస్పీ హేమంత్ కుమార్
విశాలాంధ్ర – ధర్మవరం : చెన్నై కొత్తపల్లిలో బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులు నిర్లక్ష్యం చేయలేదని ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేయడం జరిగిందని డిఎస్పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 26న సికేపల్లి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక తనపట్ల ఒకడు అసభ్యకరంగా వేధిస్తున్నాడన్న విషయంపై ఆ మైనర్ బాలిక సికె పల్లిలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అని, అక్కడ ఆ మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేయడం జరిగిందని , అయితే అమ్మాయి మైనర్ కావడంతో పోలీస్ స్టేషన్లో ఎక్కువసేపు ఉంచకుండా వారి ఇంటికి పంపించడం జరిగింది అన్నారు. ఐసిడిఎస్ , సంబంధించిన అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని వెంటనే వేధించిన బాలుని పిలిపించి ,విచారణ చేపట్టడం జరిగిందని, ఇంటికి వెళ్లిన బాలిక మృదు స్వభావి కావడంతో ఆత్మహత్యయత్నానికి ప్రయత్నం చేసిందని స్పష్టం చేశారు. మహిళలు మైనర్ బాలికల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించిన అనుచితంగా వ్యవహరించిన అటువంటి వారిపై వెంటనే కేసులు కట్టడమే కాక కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసుల నిర్లక్ష్యం లేదు
- Advertisement -
RELATED ARTICLES


