Homeఆంధ్రప్రదేశ్విద్యా శాఖ పనితీరుపై జిల్లా కలెక్టర్

విద్యా శాఖ పనితీరుపై జిల్లా కలెక్టర్

- Advertisement -

విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా విద్యా శాఖ పనితీరుపై జిల్లా విద్యా శాఖ పనితీరుపైసమావేశం నిర్వహించారు.10వ తరగతి ఫలితాల మెరుగుదలపై కీలక ఆదేశాలు*  10వ తరగతి పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు పాఠశాలల్లో ప్రత్యేక అకాడమిక్ ప్రణాళికలను ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ఈ దిశగా ఉపాధ్యాయులు తరగతి వారీగా విద్యార్థుల అభ్యాస స్థాయిని విశ్లేషించి, A–B గ్రేడ్‌ల్లో ఉన్నవారికి ప్రోత్సాహం, C–D గ్రేడ్‌ల్లో ఉన్నవారికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలన్నారు. తద్వారా 10 వ తరగతిలో జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించటం సాధ్యమని స్పష్టం చేశారు.  *విద్యార్థుల డేటా నవీకరణ–ఆధార్ & APAAR ID పై దృష్టి* ప్రతి విద్యార్థికి APAAR ID తప్పనిసరిగా ఉండాలనీ, ఇందుకోసం ఆధార్ ఆధారిత విద్యార్థి వివరాల అప్డేషన్ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని 1,684 పాఠశాలల్లో మొత్తం 3,13,958 మంది విద్యార్థులలో ఇప్పటివరకు 2,86,311 మంది విద్యార్థులకు అప్డేషన్ పూర్తయిందని, ఇది 91.51 శాతం అని సమావేశంలో తెలిపారు. పూర్తి శాతాన్ని చేరేందుకు గ్రామ/వార్డు సచివాలయాల వెల్ఫేర్, డిజిటల్ అసిస్టెంట్ తదితర సిబ్బందిని సమన్వయంతో వినియోగించాలని సూచించారు.  *మెగా టీచర్స్–పేరెంట్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించాలి* ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం డిసెంబర్ 5 వ తేదీన ప్రతి పాఠశాల పరిధిలో మెగా PTM 3.0 కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధతో, ప్రజాప్రతినిధుల సమక్షంలో, ఎటువంటి డైవర్షన్ లేకుండా విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. ఇందు కోసం పాఠశాల ఆవరణ సుందరీకరణ నుంచి కమిటీలు నిర్వహించాల్సిన బాధ్యతల వరకు స్పష్టమైన కార్యాచరణ జాబితా రూపొందించాలని అన్నారు. తల్లిదండ్రులతో విద్యార్థుల అభ్యాస స్థాయి, ప్రగతి నివేదికలు, తదితర లక్ష్యాలలో పురోగతి, కెరీర్–కౌన్సెలింగ్ వీడియోలు, TLM–కిట్ల ప్రదర్శనలు వంటి అంశాలను ఒకే వేదికపై సమగ్రంగా తీసుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రుల భాగస్వామ్యం –పాఠశాల పురోగతికి కీలకం అన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి తరగతి గదుల్లోనే కూర్చునే విధంగా స్పష్టమైన సీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.  ఉపాధ్యాయులు ఒక్కొక్క తల్లితండ్రులతో వ్యక్తిగతంగా చర్చించి వారి పిల్లల పురోగతి పై ఒక అవగాహనకి రావాలన్నారు.  అవసరమైన సహకారం, హెల్త్ కార్డ్ వివరాలు, NIPUN లక్ష్యాలు వంటి అంశాలను క్లియర్‌గా తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాలలు, ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తే 10వ తరగతి ఫలితాల్లో గుణాత్మక మార్పు సాధ్యం అన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు