Homeఆంధ్రప్రదేశ్యశోదాలో డీబీఎస్ శస్త్ర చికిత్సలు విజయవంతం

యశోదాలో డీబీఎస్ శస్త్ర చికిత్సలు విజయవంతం

- Advertisement -

– డా. రుక్మిణి మృదుల కందాడై 

విశాలాంధ్ర, రాజమండ్రి సిటీ :  ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న న్యూరోజనరేటివ్ వ్యాధులలో ఒకటైన పార్కిన్సన్ వ్యాధి (వణుకు వ్యాధి) శస్త్ర చికిత్స హైటెక్ సిటీ యశోదా ఆసుపత్రిలో డీబీఎస్ శస్త్ర చికిత్సలు విజయవంతమయ్యాయని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్  సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, పీడీఎమ్‌డీఆర్‌సీ ( క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రుక్మిణి మృదుల కందాడై  రాజమహేంద్రవరంలో యశోద మెడికల్ సెంటర్లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “మన దేశంలో ప్రతి 1 లక్ష జనాభాలో 42 శాతం నుంచి 60 శాతం మంది పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని, ఈ వ్యాధి బీపీ, షుగర్ లాగా జీవితాంతం కొనసాగుతుందన్నారు. మొదటి 3–4 సంవత్సరాలు మందులతో మెరుగుదల కనిపించినప్పటికీ తరువాత వాటి ప్రభావం తగ్గిపోతుందన్నారు. ఇటువంటి దశలో ఎఫ్.డి.ఏ మరియు డి.సి.జి.ఐ అంగీకరించిన ఏకైక ఆధునిక చికిత్స — డి.బి.ఎస్ (డీప్ బ్రెయిన్ స్టిములేషన్)” అని వివరించారు. ఇటీవల హుజురాబాద్‌కు చెందిన అశోక్ రెడ్డి మరియు కాజీపేటకు చెందిన సంగీత పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో చికిత్స పొందగా, వైద్య బృందం డీప్ బ్రెయిన్ స్టిమ్యూలేషన్ (డి బి ఎస్) శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు డాక్టర్ రుక్మిణి మృదుల తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు రోగులు ఆరోగ్యంగా, సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారన్నారు. “ఎలక్ట్రోడ్‌ను మెదడులోని నిర్దిష్ట భాగంలో అమర్చడం, వాటిని ఛాతి ప్రాంతంలో అమర్చే చిన్న పరికరంతో అనుసంధానం చేయడం ద్వారా కంపనలు, గట్టితనం, నడక, శరీర సమతుల్యత సమస్యలు గణనీయంగా తగ్గుతాయని, డిబిఎస్ 30 ఏళ్లకుపైగా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఫలితాలు అందిస్తున్న చికిత్స” అని ఆమె తెలిపారు.  హైటెక్ సిటీ, సోమాజిగూడ, మలక్‌పేట, సికింద్రాబాద్‌లలో ఉన్న యశోద హాస్పిటల్‌లు 4000కు పైగా పడకల సామర్థ్యం, 20 లక్షల చదరపు అడుగుల వైద్య విస్తీర్ణం, అరుదైన,  అత్యంత సంక్లిష్ట కేసులకు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్సలు అందిస్తున్నాయని తెలిపారు. ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటు ఖర్చులతో అందించడం యశోద లక్ష్యం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో డా రుక్మిణి మృదుల కందాడై తోపాటు డీజియం సంతోష్ కుమార్,ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాల వీరభద్ర,  మార్కెటింగ్ మేనేజర్ షరీఫ్,  ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు