ముంబై: ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్ను తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కథానాయికలకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడానికి చాలా మంది స్టార్ హీరోలు సిద్ధంగా లేరని ఆమె విమర్శించారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని తాప్సీ వెల్లడించింది.
“ఒక సినిమాలో నేను డబుల్ రోల్ చేస్తున్నప్పుడు, సదరు హీరో ఆ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేశాడు. దానికి ఆయన చెప్పిన కారణం ఏంటంటే… సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ నిడివి, ప్రాధాన్యత ఉంటే చివరకు ప్రేక్షకుల సానుభూతి, ప్రశంసలు ఆమెకే దక్కుతాయని ఆయన భయపడ్డాడు. అంతకుముందే ఆ హీరోతో తాను కలిసి పనిచేసినప్పటికీ… కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉందనే అభద్రతా భావంతో ఆయన వెనక్కి తగ్గడం నన్ను ఆశ్చర్యపరిచింది” అని తాప్సీ పేర్కొంది. కేవలం సీనియర్ హీరోలే కాదు, ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న యువ హీరోలు కూడా హీరో పాత్ర నిడివి తక్కువగా ఉంటే అటువంటి సినిమాలకు దూరంగా ఉంటున్నారని ఆమె విమర్శించారు. హీరోయిన్ ఆధిపత్యం ప్రదర్శిస్తుందనే భయంతో మంచి కథలను వదులుకోవడం వల్ల చిత్ర పరిశ్రమలో సమానత్వం అనేది ప్రశ్నార్థకం అవుతోందని ఆమె అభిప్రాయపడింది.
మాకు ప్రాధాన్యతనివ్వడం హీరోలకు నచ్చదు
- Advertisement -


