వాషింగ్టన్: ఇరాన్లో అణుకేంద్రాలపై తాము దాడి చేసిన తర్వాత ఇజ్రాయిల్ నిఘా సంస్థ మొస్సాద్‌కు చెందిన ఏజెంట్లు అక్కడికి వెళ్లి పరిశీలించారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడిరచారు. నాటో సదస్సులో ఆయన మాట్లాడుతూ ‘‘మీకు తెలుసా వాళ్ల (ఇజ్రాయిల్) మనుషులు అక్కడికి వెళ్లి పరిశీలించి పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపారు. ఇప్పుడు ఇజ్రాయిల్ దానిపై ఓ నివేదిక తయారు చేస్తోంది. పూర్తిగా ధ్వంసమైందని వారు చెప్పడంతో పాటు.. నేను కూడా నమ్ముతున్నాను. ఏదీ మిగిలే అవకాశం లేదు’’ అని ఫర్దో అణు కేంద్రం గురించి పేర్కొన్నారు. ఇరాన్‌లోని అణు కేంద్రాలు అమెరికా దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నాయని సీఐఏ కూడా ధ్రువీక రించింది. ఈమేరకు దాని డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. అక్కడి కేంద్రాలు ధ్వంసం కావడం వల్ల చాలాకాలం వరకు అవి కోలుకొనే పరిస్థితి లేదన్నారు. వీటి పునర్ నిర్మాణానికి కొన్నేళ్ల సమయం పడుతుందన్నారు. మరోవైపు న్యూయార్క్‌టైమ్స్, సీఎన్ఎన్ మాత్రం పెంటగాన్ నివేదికను ఉటంకిస్తూ… అమెరికా దాడులు ఇరాన్ అణుకేంద్రాలపై పెద్దగా ప్రభావం చూపలేదని పేర్కొన్నాయి. దీనికితోడు తెహ్రాన్ మరికొన్ని నెలల్లోనే పూర్తిస్థాయిలో యురేనియం శుద్ధి చేపట్టే అవకాశం ఉందని వెల్లడిరచాయి.
ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం మళ్లీ రావొచ్చు…
ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం మళ్లీ రావొచ్చేమోనని ట్రంప్ అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ఆ రెండు దేశాల తో నేను చర్చలు జరిపాను. అవి రెండూ ప్రస్తుతానికి అలిసిపోయాయి. అయితే మళ్లీ యుద్ధాన్ని ప్రారంభిస్తారా? అంటే బహుశా ఏదో ఒకరోజు రావొచ్చు. త్వరలోనే మళ్లీ ప్రారంభం కావొచ్చు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇక ఇరాన్‌తో అణు చర్చల అంశాన్ని అమెరికా అధ్యక్షుడు మరోసారి ప్రస్తావించారు. ‘‘వచ్చే వారం తెహ్రాన్‌తో అణు చర్చలు జరుపుతా. అణ్వాయుధాలు తయారుచేయాలన్న ఆశయాన్ని వదిలేసేలా ఇరాన్‌తో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది’’ అని ట్రంప్ వెల్లడిరచారు. ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడం వల్లే పశ్చిమాసియాలో యుద్ధానికి త్వరగా ముగింపు పడిరదని ఆయన చెప్పుకున్నారు. మరోవైపు, ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలను సడలించే అవకాశాలున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు. ‘‘ప్రస్తుతం ఇరాన్ పునర్ నిర్మాణానికి నగదు వనరులు కావాలి.ఆ దేశం కోలుకునేలా మద్దతు ఇవ్వడం కోసం కొన్ని ఆంక్షలను సడలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం’’ అని నాటో సదస్సులో ట్రంప్ వెల్లడిరచారు.
మొస్సాద్ ఏజెంట్లు అణు కేంద్రాలకు వెళ్లారు: ట్రంప్
- Advertisement -
RELATED ARTICLES


