Homeఆంధ్రప్రదేశ్రెచ్చగొడితే రెచ్చిపోవద్దు

రెచ్చగొడితే రెచ్చిపోవద్దు

- Advertisement -

వైసీపీ ట్రాప్‌లో పడొద్దు…అలజడి రేపేందుకు కుట్రలు
టీడీపీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు

సమాజంలో అలజడి సష్టించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని… టీడీపీ శ్రేణులు వారి ట్రాప్‌లో పడకుండా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆ పార్టీ నేతలకు సూచించారు.

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: సమాజంలో అలజడి సష్టించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని… టీడీపీ శ్రేణులు వారి ట్రాప్‌లో పడకుండా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆ పార్టీ నేతలకు సూచించారు. టీడీపీ మంత్రులు, సీనియర్ నేతలతో చంద్రబాబు సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసే బాధ్యత మంత్రులు, సీనియర్ నేతలపై ఉందని సీఎం స్పష్టం చేశారు. వైసీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయింది. రాష్ట్ర ప్రజలంతా ఆ పార్టీని చీదరించుకుంటున్నారు. చేసిన పాపాలనుంచి ప్రజల దష్టి మళ్లించాలనేదే ప్రస్తుతం వారి కుట్ర. పెట్టుబడులు సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే మన ప్రధాన అజెండా. గత 20 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ఏపీకి భారీగా పెట్టుబడిదారులు వస్తున్నారు. ఈ అభివృద్ధి పరిణామాలు వైసీపీకి నచ్చడం లేదని, అందుకే దాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.అది వైసీపీ నేతలకు నచ్చడం లేదు. అందుకే అడ్డుకునేందుకు కుట్రలకు పాల్పడుతున్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరుతాం. ఈలోగా టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించేలా మంత్రులు, నేతలు బాధ్యత తీసుకోవాలి. కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వైసీపీ ట్రాప్‌లో పడొద్దు. అలా జరగకుండా పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకోవాలి. హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై వైసీపీ పుట్టింది. ఆ పార్టీ ట్రాప్‌లో పడితే వారికీ, మనకీ తేడా ఉండదు అని చంద్రబాబు అన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చట్టాన్ని గౌరవించాలి…సంయమనం పాటించాలి : పల్లా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచనలతో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మరలా పార్టీ నేతలతో టెలికాన్ఫÛరెన్స్ నిర్వహించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాలను కాలరాస్తూ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అరాచక పాలన సాగించారని గుర్తు చేశారు. అలాంటి పాలనను మనం వ్యతిరేకించాం కానీ ఇప్పుడు మనమే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైన మార్గం కాదని ఆయన స్పష్టంగా చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న పోలికలు, ప్రేరణలకు లోనై స్పందించాల్సిన అవసరం లేదని సూచించారు. తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన నిబద్ధత, ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు చట్టాన్ని గౌరవించే వారిగా సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని, అదే మన పార్టీకి ఉన్న బలమైన బ్రాండ్ ఇమేజ్ అని ఆయన స్పష్టం చేశారు. చట్టాన్ని అందరూ గౌరవించాలి, ప్రత్యర్థుల రెచ్చగొట్టే చర్యల పట్ల సంయమనం పాటించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకుల దుర్భాష ప్రజలకు అసహ్యం కలిగిస్తోందని, రాజకీయ నాయకులు ఇలా మాట్లాడాలా అని ప్రజలే ప్రశ్నిస్తున్నారని అన్నారు. సీనియర్ నాయకులపై బూతులు మాట్లాడడం జుగుప్సాకరమని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసినా, చట్టప్రకారం చర్యలు తీసుకోవడమే సరైన మార్గమని చెప్పారు.దాడులు, హింస తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదని, ప్రజాస్వామ్య విలువలతోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు