Homeవేడెక్కిన రాజకీయం

వేడెక్కిన రాజకీయం

- Advertisement -

దాడులు, గహదహనాలతో ఉద్రిక్తత

. అంబటి, జోగి ఇళ్లపై టీడీపీ దాడులు
. కుట్రలు సహించేది లేదన్న చంద్రబాబు
. ప్రజాస్వామ్యం ఖూనీ అంటున్న జగన్

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి:
తిరుపతి లడ్డూ వ్యవహారంతో రాష్ట్ర రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మాటల యుద్ధం కొనసాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో రాష్ట్రం భగ్గుమంటుంది. మాజీమంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేసి… బీభత్సం సష్టించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాU్యలు చేశారన్న ఆరోపణతో ఈ దాడులు జరిగాయి. చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని టీడీపీ నేతలు, మంత్రులు ఘాటుగా హెచ్చరించారు. తాము సంయమం పాటిస్తున్నామని, లేకపోతే ఎవరూ రోడ్డుపై తిరగబోరని అంటున్నారు. ఇటు చంద్రబాబు, అటు జగన్‌మోహన్ రెడ్డి సైతం దాడులపై స్పందించారు. వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని, వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ శ్రేణులకు హితవు చెప్పారు. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటులేదని, తాము అధికారంలోకి వస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని జగన్ అంటున్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. అంబటిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. మరోవైపు, రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందని మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి దీటుగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీని తూర్పారబట్టారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాంబాబుపై కేసులు, అరెస్టు, జైలుకు తరలింపు ఘటనతో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అది మరువకముందే మరో మాజీ మంత్రి జోగి రమేశ్‌పై కేసు నమోదు చేయడం కలకలం సష్టించింది. అంబటిపై వివిధ పోలీస్‌స్టేషన్లలో 16 కేసులు నమోదు కాగా… నకిలీ మద్యం తయారీ కేసులో బెయిల్‌పై ఇటీవల విడుదలైన జోగి రమేశ్… మంత్రి నారా లోకేశ్‌పైన, చంద్రబాబుపైన చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రమేశ్‌ను అరెస్టు చేస్తారన్న సమాచారంతో ఆయన అందుబాటులో లేకుండా వెళ్లినట్లు తెలిసింది. జోగి ఇంటిపై దాడులకు పాల్పడిన ఘటనలో 11 మందిని పోలీసులు అరెస్టు చేసి…వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. వరుసవారీగా చర్యలతో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో రాజకీయ ఉద్రిక్తలు నెలకొన్నాయి. అరెస్టయిన అంబటి రాంబాబుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారన్న అభియోగాలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె మీడియా సమావేశం నిర్వహించి… అంబటి ఇంటిపైనా, కార్యాలయంపైనా జరిగిన దాష్టీకాన్ని తప్ప్పుపట్టింది. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటిపై చంద్రబాబు కక్ష కట్టారంటూ ఆరోపించారు. అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడులు, దహనాల ఘటనలను ఖండిస్తూ సీఎం చంద్రబాబుకు వైసీపీ సీనియర్ నేత ముద్రగడ్డ పద్మనాభం లేఖ రాశారు. వారికి మద్దతుగా వంగవీటి నరేంద్ర, మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తదితరులు మీడియా సమావేశాలు నిర్వహించి… కూటమి ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు.
జోగి ఇంటిని పరామర్శించిన సజ్జల బదం
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన జోగి రమేశ్ ఇంటిని పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి సందర్శించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దాడులను ప్రజాస్వామ్యయుతంగానే ఎదుర్కొంటామని, అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు