ఈసీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు
విశాలాంధ్ర – హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి దిగజారి చేస్తున్న ప్రయత్నా లను, చౌకబారు మాటలను పరిశీలించి, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని సీఈవో సుదర్శన్‌రెడ్డిని కోరినట్టు శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి … ముస్లింపై చేసిన వ్యాఖ్యలపై గురువారం ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘బీఆర్‌ఎస్ పార్టీ ఒక చారిత్రక బాధ్యతను నిర్వహించింది. తెలంగాణ ప్రజలు 60 సంవత్సరాలు పడిన గోసను, అన్యాయం, అవమానం, అవహేళనకు గురైన తెలంగాణ జాతిని విముక్తి చేసింది. దానికి కేసీఆర్ అధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికే ఆదర్శవంతమైన పాలను అందించింది’ అని కొనియాడారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తే పథకాలు పోతాయని సీఎం బెదిరిస్తున్నాడని దుయ్యబట్టారు. ఉప ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు
రేవంత్‌రెడ్డిపైచర్యలు తీసుకోండి
- Advertisement -


