Homeరైతుల ప్లాట్లకు సరిహద్దు రాళ్లు

రైతుల ప్లాట్లకు సరిహద్దు రాళ్లు

- Advertisement -

. మూడు నెలల్లో పూర్తి
. 15 నుంచి పెగ్‌ మార్కింగ్‌
. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు
. ప్రభుత్వం కీలక నిర్ణయం

విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర రాజధాని అమరావతి రైతులు కొంతకాలంగా తమ సమ స్యలు తీరడం లేదని ఆందోళనలు చేస్తున్నారు. ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంటే ఏడాదిన్నర అవుతున్నా ఫలితం లేదని ఆవేదన చెందుతు న్నారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు అధికారులకు మున్సిపల్‌ మంత్రి నారాయణ కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గతంలో టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసిన తర్వాత భూములిచ్చిన రైతులకు ఇచ్చిన హామీ మేరకు రిటర్నబుల్‌ ప్లాట్లు ఇవ్వడం ప్రారంభించారు. రైతులకు ఎక్కడ ప్లాట్లు ఇస్తున్నారో చూపించి వాటికి సరిహద్దు రాళ్లు కూడా వేయించారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి కాకుండానే రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, నాటి వైసీపీ సర్కార్‌ రిటర్నబుల్‌ ప్లాట్ల వ్యవహారాన్ని నిర్లక్ష్యం చేయడంతో సరిహద్దు రాళ్లు కూడా కుంగిపోయాయి. దీంతో తమ ప్లాట్లు ఎక్కడున్నాయో, ఎంత హద్దులో ఉన్నాయో తెలియక అమరావతి రైతులు ఆందోళన చెందారు. గతేడాది కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక అమరావతి రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్‌ ప్లాట్లను వారికి పూర్తి స్థాయిలో పంపిణీ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్లు చేయించడం, ఇతర సమస్యలు తీర్చడంపై దృష్టిపెట్టింది. తాజాగా మున్సిపల్‌ మంత్రి నారాయణ ఆదేశాలతో వచ్చే నెల 15వ తేదీ నుంచి హద్దు రాళ్లు లేని ప్లాట్ల కు పెగ్‌ మార్క్‌ వేసి హద్దు రాళ్లు వేయాలని సీఆర్డీయే నిర్ణయించింది. మూడు నెలల్లోగా రైతుల ప్లాట్లలో సరిహద్దు రాళ్లు వేయడం పూర్తి చేయాలని అధికారులు నిర్ణయిం చారు. రాజధానిగా అమరావతిని పార్లమెం ట్‌లో చట్టం చేసేలా చూడాలని అమరావతి రాజధాని రైతుల ఐక్య కార్యాచరణ సమితి ప్రభుత్వాన్ని కోరింది. దీని పైన సీఆర్డీఏ దిల్లీ కేంద్రంగా తమ ప్రయత్నాలను వివరించింది. డిసెంబర్‌లో అమరావతి బిల్లు పార్లమెంట్‌కు వచ్చే అవకాశం ఉందని సూచన ప్రాయంగా అధికారులు వెల్లడిరచారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసింది. 29 గ్రామ పంచాయితీల్లో డ్రెయిన్లు, నీటి సరఫరా ఇతర మౌలిక సదుపాయాల కోసం ఎల్పీఎస్‌ జోన్స్‌ క్రిటికల్‌ ఇన్‌ ఫ్రా అండ్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ ప్లాన్‌ కింద రూ.904 కోట్లతో పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. అమరావతి రాజధాని నగరంలో సివరేజ్‌ వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు రూ. 411 కోట్లు, అలాగే వాటర్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను రూ. 376.60 కోట్లతో ఏర్పాటు చేసేం దుకు అథారిటీ అంగీకరించింది. కృష్ణాయపాలెం, వెంకటపాలెం , పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.1863 కోట్ల నిధుల మంజూరుకు పరిపాలనా అనుమతినిస్త్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారిచేసింది. లే అవుట్లలో రోడ్లు, కాలువలు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు, విద్యుత్‌ ఐసీటీ కోసం యుటిలిటీ డక్ట్‌లు, పునర్వినియోగ నీటి లైన్‌, ఎస్టీపీ, అవెన్యూ ప్లాంటేషన్‌ నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలిచేందుకు అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది. రాజధాని గ్రామాల్లో వర్షపు నీరు సత్వరం పంపింగ్‌ చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఉండవల్లి గ్రామం వద్ద మరో వరద పంపింగ్‌ స్టేషన్‌ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 8400 క్యూసెక్కుల వరద నీటిని కృష్ణానది లోకి పంపింగ్‌ చేసేందుకు వీలుగా ప్రాజెక్టు సర్వే, దర్యాప్తు, డిజైన్‌, నిర్మాణం, పరీక్ష, కమిషనింగ్‌ కోసం రూ.595.01 కోట్ల నిధులు మంజూరు చేస్తూ పరిపాలనా ఉత్తర్వులు జారీ చేశారు.15 ఏళ్ల పాటు ప్రాజెక్టు కార్యకలాపాలు, నిర్వహణ చేసేలా టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇచ్చారు. ప్రపంచ బ్యాంక్‌, ఎడీబీ ఇచ్చే నిధులతో సీఆర్డీఏ ఈ ప్రాజెక్టు చేపట్టనుంది. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం అదనపు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా రూ.1,500 కోట్ల రుణం పొందేందుకు ఆమోదం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమరావతి సిటీ లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు వినియోగించానున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు