విశాలాంధ్ర – సీతానగరం: సీతానగరం మండలం ప్రధాన రహదారి పై ఉన్న విద్యుత్ స్థంబాల మార్పుతో విద్యుత్ కి అంతరాయం ఏర్పడుతుంది అని మండల విద్యుత్ అధికారి చంద్రమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏ ఈ చంద్రమోహన్ మాట్లాడుతూ అక్టోబర్ 3, 4వ తేదీలో రెండు రోజులు పాటు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ముగ్గుళ్ళ విద్యుత్ సబ్ స్టేషన్ 33/11 పరిధిలో రఘుదేవపురం గ్రామ పంచాయితీ పరిధిలో ప్రధాన రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డు పై ప్రస్తుతం ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన స్తంభాలను వేయడం జరుగుతుంది అని అన్నారు. కావున ఈ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న రఘుదేవపురం, నల్లగొండ, కోరుకొండ మండలం కోటి గ్రామాల్లో వీటి పరిధిలోని వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగుతుంది అని అన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు అందరూ ఈ అసౌకర్యానికి గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు.
విద్యుత్ స్థంబాల మార్పుతో విద్యుత్ కి అంతరాయం
- Advertisement -
RELATED ARTICLES


