విశాలాంధ్ర – నిడదవోలు : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీకోటసత్తెమ్మను దసరా ఉత్సవం11వ రోజు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక స్వర్ణ ఆభరణాలు, ప్రత్యేక పూలతో అలంకరించగా పదివేల మంది భక్తులు దర్శించుకున్నట్లు సహాయ కమీషనర్, ఆలయ కార్య నిర్వహణ అధికారి వి. హరి సూర్య ప్రకాష్ తెలిపారు. శ్రీ కోట సత్తమ్మ ను దర్శించుకున్న భక్తులులకు దాతల సహకారంతో ఉచిత అన్నప్రసాదంను వితరణ గావించారు. భక్తుల ద్వారా అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు రూ 50,200 లు,దర్శనం టికెట్లు రూ 78560లు,ప్రసాదములు రూ 1,00,900 lu అన్నదానం 29,808లు, ఇతరములు రూ 40,632 లు మొత్తం రూ 3,00,100 లు ఆదాయంగా భక్తుల ద్వారా లభించినట్లు హరి సూర్య ప్రకాష్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థమే చేసిన ఏర్పాట్లను శ్రీ భక్తుల సౌకర్యార్థమే చేసిన ఏర్పాట్లను ఫౌండర్ ఫ్యామిలీ, మెంబర్ దేవులపల్లి రవి శంకర్, ప్రధాన అర్చకులు అప్పారావు శర్మ, ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.
స్వర్ణాభరణాలంకరణలో శ్రీ కోట సత్తెమ్మ
- Advertisement -
RELATED ARTICLES


