Homeక్రీడలుహోటల్ మహిళా సిబ్బందితోపాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన

హోటల్ మహిళా సిబ్బందితోపాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన

- Advertisement -

సారీ చెప్పిన మేనేజర్!
కొలంబో: టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన పాకిస్థాన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. పాక్ జట్టులోని ఓ ఆటగాడు హోటల్‌లో పనిచేసే మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జట్టు ప్రతిష్టను మరోసారి దెబ్బతీసేలా మారింది. శ్రీలంకలోని క్యాండీ నగరంలో ఉన్న ఒక హోటల్‌లో పాకిస్థాన్ జట్టు తాత్కాలికంగా బస చేసింది. అదే సమయంలో ఓ ప్లేయర్ హౌస్‌కీపింగ్ విభాగంలో పనిచేసే మహిళతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆ ప్లేయర్ ప్రవర్తనతో భయపడిన ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. దీంతో సిబ్బంది వెంటనే స్పందించారు. అక్కడికి చేరుకుని ఆ మహిళను రక్షించారు. అనంతరం ఈ విషయాన్ని పాకిస్థాన్ జట్టు మేనేజర్ నవైద్ చీమాకు తెలియజేశారు. ఈ ఘటనపై హోటల్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆటగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే జట్టు మేనేజర్ ఆ ఆటగాడి తరఫున క్షమాపణలు చెప్పి విషయం అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. అంతేకాదు, ఆ ఆటగాడిపై జరిమానా కూడా విధించినట్టు చెబుతున్నారు. సూపర్ 8లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్ జరిగే ముందు ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని టెలికాం ఆసియా స్పోర్ట్ నివేదించింది. ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సైతం విచారణ జరిపే అవకాశముంది. ఆ ఆటగాడిని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని పిలిచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అక్కడ ఆ ప్లేయర్‌పై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు? అనే వివరాలు బయటకు రాలేదు. విదేశీ పర్యటనల సమయంలో పాకిస్థాన్ జట్టుకు ఇలాంటి విభేదాలు కొత్తవేం కాదు.. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్ యువ జట్టు తరఫున ఆడిన యువ బ్యాటర్ హైదర్ అలీపై ఒక యువతిపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేసినప్పటికీ సరైన ఆధారాలు లభించకపోవడంతో తరువాత విడుదల చేసినట్టు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు