తెహ్రాన్: అమెరికా`ఇజ్రాయిల్ భీకర పోరు క్రమంలో కీలకమైన హోర్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. అటుగా వచ్చే వాణిజ్య నౌకలను ధ్వంసం చేస్తామని హెచ్చరించడమే కాకుండా కొన్ని నౌకలపై దాడులు సైతం చేసింది. అనేక దేశాల ఓడలను నిలిపివేసింది. దీంతో అంతర్జాతీయ చమురు సంక్షోభం నెలకొంది. ఇలాంటి పరిణామాల క్రమంలో హర్మూజ్ మార్గంలో భారతీయ నౌకల రవాణాకు ఇరాన్ అనుమతిచ్చింది. దౌత్య చర్చలు ఫలించడంతో పుష్పక్, పరిమల్ అనే రెండు నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించినట్లు తెలుస్తోంది. మిగతా నౌకలు కూడా హోర్ముజ్ గుండా భారత్‌కు రావచ్చు. ఈ మార్గంలో ఆంక్షల కారణంగా భారత్‌కు చమురు, ఫెర్టిలైజర్స్, కొన్ని రకాల ఆహార పదార్థాలు నిలిచిపోవడంతో ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఈ పరిణామం భారత్‌కు ఊరటనిచ్చింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చర్చలతో ఈ మేరకు అనుమతులు లభించాయి. అమెరికా, ఇజ్రాయిల్, యురోపియన్ యూనియన్‌తో పాటు వాటి మిత్ర దేశాల నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతివ్వడం లేదు. సౌదీ నుంచి బయల్దేరిన లిబేరియన్ నౌక ముంబై పోర్టుకు చేరుకుంది. యుద్ధం మొదలైన తర్వాత ఒక నౌక క్షేమంగా భారత్‌కు చేరుకోవడం ఇదే మొదటివసారి. తమ అనుమతి లేకుండా హోర్ముజ్ గుండా ప్రయాణానికి వీల్లేదని ప్రపంచ దేశాలకు ఇరాన్ తేల్చిచెప్పిన విషయం విదితమే.
హోర్ముజ్ మార్గంలో భారత్‌కు అనుమతి
- Advertisement -
RELATED ARTICLES


