స్పష్టం చేసిన దిల్లీ హైకోర్టు
న్యూదిల్లీ: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా `సరిగవ ఆడియో సంస్థతో కొనసాగుతున్న హక్కుల వివాదంపై కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేయడంతో ఈ అంశం సినీ, సంగీత వర్గాల్లో చర్చకు దారి తీసింది. తుది తీర్పు వెలువడే వరకు 134 సినిమాలకు చెందిన పాటలను ఇళయరాజా వినియోగించరాదని కోర్టు స్పష్టం చేసింది. గత సంవత్సరం ‘అగత్యా’ సినిమాలోని ఓ పాట విషయంలో ఇళయరాజా-సరిగమ మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి ఈ వివాదం మరింత వేడెక్కింది. 1976 నుంచి 2001 సమయంలో ఇళయరాజా సంగీతం అందించిన 134 చిత్రాల ఆడియో హక్కులు ఆయా నిర్మాతలు సరిగమ ఆడియో సంస్థకు శాశ్వతంగా విక్రయించారు. వాటిని ఇళయరాజా ఉపయోగించుకోవచ్చు. కానీ ఆయన ఆ పాటలను డిజిటల్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లకు ఉపయోగించుకునేలా అనుమతులు ఇచ్చారు. ఆ ఆరోపణలతో సరిగమ సంస్థ కోర్టును ఆశ్రయిం చింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్డు నిర్మాతల నుంచి కొనుగోలు చేసిన తర్వాత ఆ పాటలపై పూర్తి హక్కులు సరిగమకే ఉంటాయని స్పష్టం చేసింది. సంస్థ అనుమతి లేకుండా ఆ పాటలను ఉపయోగించడం సరికాదని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
134 సినిమాల పాటలపై ఇళయరాజాకు హక్కులేదు
- Advertisement -


