Homeఆంధ్రప్రదేశ్యూనిఫామ్ లేదని 150 గుంజీలు

యూనిఫామ్ లేదని 150 గుంజీలు

- Advertisement -

అస్వస్థతకు గురైన విద్యార్థులు

కోట:- కోటలోని సాంఘిక సంక్షేమ వసతి గృహానికి చెందిన విద్యార్థులను శనివారం పీఈటి సుభాన్ తీవ్రంగ కర్రతో కొట్టి గుంజీలు పెట్టించడంతో విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన శనివారం తిరుపతి జిల్లా కోటలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో చోటుచేసుకుంది.సేకరించిన వివరాల మేరకు జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాలలో ఆరు నుండి పదో తరగతి వరకు 160 మంది సాంఘిక సంక్షేమ వసతి గృహనికి చెందిన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.అయితే శనివారం విద్యార్థులు వైట్ యూనిఫామ్ ధరించకుండా పాఠశాలకి వెళ్ళడంతో ప్రేయర్ సమయంలో పి.ఈ.టి సుభాన్ యూనిఫామ్ ఎందుకు వేసుకు రాలేదని విద్యార్థులను తీవ్రంగా కొట్టి వారిచేత 150 వరకు గుంజీలు పెట్టించారు. దీంతో వారు తీవ్ర అస్వస్థకు గురై విషయం బయటికి చెబితే మరల దాడి చేస్తాడని భయపడి నొప్పిని భరించి వసతి గృహానికి వచ్చి బోరున విలపించి వార్డెన్ ఉషకు విషయాన్ని తెలిపారు. దీంతో వార్డెన్ స్థానిక పోలీసులకి సమాచారాన్నందించి అనంతరం 108 వాహనం ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు