Home1,500 కళాశాలలనిరవధిక బంద్‌

1,500 కళాశాలలనిరవధిక బంద్‌

- Advertisement -

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం డిమాండ్‌

హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై నిరవధిక బంద్‌కు వెళ్లాలని యాజమాన్యాలు నిర్ణయించడంతో సోమవారం దాదాపు 1,500 కళాశాలలు మూతపడ్డాయి. మొత్తం రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల్లో కనీసం రూ.900 కోట్లు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్న యాజమాన్యాలు… ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, బకాయిలను చెల్లించడానికి ముందుకు రావడం లేదని మండిపడ్డాయి. తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల అసోసియేషన్ల సమాఖ్య (ఎఫ్‌ఏటీహెచ్‌ఐ)కు చెందిన కె.రామదాసు మాట్లాడుతూ ‘పెండిరగ్‌ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైనందున కళాశాల యాజమాన్యాలు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నాయి. మాకు చెల్లించాల్సిన మొత్తాన్ని మేము డిమాండ్‌ చేస్తున్నందున ప్రభుత్వం విజిలెన్స్‌ తనిఖీలతో మా నోరు మూసివేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రకటించిన విధంగా బంద్‌తో ముందుకు సాగాలని మేము నిర్ణయించుకున్నాము’ అని తెలిపారు. అన్ని డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఫార్మసీ, పాలిటెక్నిక్‌, ఎంసీఏ, ఎంబీఏ, లా కళాశాలలు నిరసనలో పాల్గొంటాయని ఎఫ్‌ఏటీహెచ్‌ఐ సభ్యులు తెలిపారు. దీపావళికి ముందే ప్రభుత్వం రూ.1,200 కోట్లు చెల్లించాలని కళాశాలలు డిమాండ్‌ చేశాయి. అయితే ఇప్పటివరకు రూ.300 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. జిల్లాస్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, నగర శివార్లలో లక్షమందికి పైగా సిబ్బందితో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని వారు తెలిపారు. లక్షలాది మంది విద్యార్థులతో బహిరంగ సభ నిర్వహించి… ఎమ్మెల్యేలు, అధికారుల ఇళ్లను ముట్టడిరచాలని యాజమాన్యాలు యోచిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు