Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబోరు బావుల కేబుల్ వైర్లు చోరీ…

బోరు బావుల కేబుల్ వైర్లు చోరీ…

- Advertisement -

విశాలాంధ్ర : చిలమత్తూరు,… మండల పరిధిలోని వీరాపురం పంచాయతీ వెంకటాపురం గ్రామంలో పదిమంది రైతుల బోరుబావుల కేబుల్ వైర్లను గుర్తుతెలియ వ్యక్తులు చోరీ చేసిన సంఘటన చోటుచేసుకుంది, వెంకటాపురం గ్రామ రైతు రామకృష్ణారెడ్డి, మాట్లాడుతూ గత మూడు నెలలుగా కేబుల్ వైర్లు మూడుసార్లు దొంగలించారని, పదిమంది రైతుల బోరు బావుల కేబుల్ వైర్లను రహదారికి ఇరువైపులా ఉన్న వాటిని టార్గెట్ చేసుకొని గత మూడు నెలల నుంచి ఇబ్బందులు పెడుతున్నారని, ఆయనతోపాటు లక్ష్మీనారాయణ ఆదిరెడ్డి, రామకృష్ణారెడ్డి, రామచంద్రప్ప, మంగమ్మ నంజుండప్ప ఎం లక్ష్మీనారాయణ, శివప్ప, చలపతి తదితర రైతుల బోరు బావుల కేబుల్ ను చోరీ చేశారని తెలిపారు.ఇప్పటికైనా పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు