Homeసినిమా19న థియేటర్లలో ‘ఉస్తాద్ భగత్ సింగ్‌‘

19న థియేటర్లలో ‘ఉస్తాద్ భగత్ సింగ్‌‘

- Advertisement -

హైదరాబాద్ : సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్‌‘ సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వరుసగా వచ్చే లాంగ్ వీకెండ్లు, దాదాపు రెండు వారాల పాటు ఉండే సెలవుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న మరో భారీ ఎంటర్‌టైనర్ ఇది. గతంలో ‘గబ్బర్ సింగ’తో వీరు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించారు. ఆ మ్యాజిక్‌ను తిరిగి సృష్టించడానికి, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరిచిపోలేని థియేటర్ అనుభవాన్ని అందించడానికి ఈ ద్వయం సిద్ధమవుతోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ’ నేపథ్య సంగీతం బాధ్యతలను ఎస్. తమన్ కు అప్పగించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రేక్షకులను డ్యాన్స్ చేయిస్తే, తమన్ తన నేపథ్య సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళనున్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా పనులు సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పరస్పర చర్చల అనంతరం సినిమా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మార్పు చేయడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు