Homeవిశ్లేషణ2035 లక్ష్యంగా ఇరాన్`చైనా అడుగులు

2035 లక్ష్యంగా ఇరాన్`చైనా అడుగులు

- Advertisement -

సంజయ్ పాండే

పశ్చిమాసియాలో భూ-రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడిని ఎదుర్కొంటూ ఇరాన్ యుద్ధరంగంలో నిలిచిందే కాకుండా, వ్యూహాత్మక ఆధిపత్యాన్ని సాధించింది. ఈ విజయం వెనుక ఇరాన్ స్వదేశీ సైనిక సామర్థ్యం, ప్రజల ఐక్యత, నిర్ణయాత్మక దౌత్యం ఉన్నాయి. దానికి బలమైన ఆధార స్తంభం చైనా. చైనా ఇరాన్ యొక్క ఆర్థిక జీవనాధారాన్ని నిలబెట్టింది. పాశ్చాత్య ఆంక్షల కారణంగా చాలా దేశాలు ఇరాన్ చమురు కొనుగోలు చేయడానికి భయపడుతుండగా, చైనా ఇరాన్ అతి పెద్ద చమురు వినియోగదారుగా నిలిచింది. కాల్పుల విరమణ ఒప్పందం కోసం చైనా చురుకైన దౌత్య మద్దతు ఇచ్చింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికాతో పరోక్ష చర్చలు జరుగుతుండగా, చైనా మొదటి నుండి ఇరాన్ యొక్క దౌత్య దృక్పథాన్ని స్వాగతించింది. ఒప్పందం ప్రకటించిన తర్వాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ sమూ ఇరానీ సహచరుడు అబ్బాస్ అరాగచీతో టెలిఫోన్‌లో చర్చిస్తూ అణచివేతపై ఇరాన్ ప్రభుత్వం, ప్రజల దృఢత్వం, బాధ్యతాయుతమైన దౌత్య దృక్పథాన్ని ప్రశంసించారు. చైనా, రష్యా రెండు దేశాలు ఇస్లామాబాద్ ఒప్పందాన్ని స్వాగతించాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీలావ్రోవ్ అమెరికా, ఇజ్రాయెల్ ఒప్పందాన్ని పాటించాల్సిన బాధ్యతను నొక్కి చెప్పారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మద్దతుతో అంతర్జాతీయ సమాజం ఈ ఒప్పందానికి మద్దతు ఇవ్వాలనే దానిపై చైనా-రష్యా ఏకీభవించాయి. ఈ రాజకీయ కూటమి కారణంగా ఇరాన్‌ను ఒంటరి చేయాలనే అమెరికా ప్రయత్నాలు విఫల మయ్యాయి. యుద్ధానంతర పునర్నిర్మాణ కాలంలో కూడా చైనా ఇరాన్, లెబనాన్‌కు మద్దతుగా నిలవనున్నట్లు ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేస్తూ, బీజింగ్ యుద్ధానంతర పునర్నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని ఆర్థిక పరిస్థితిని, ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి త్వరలోనే కొత్త మానవతా సహాయం పంపబడుతుందని తెలిపారు. ఇస్లామాబాద్ ఒప్పందం కింద 300 బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ నిధిని సమీకరించనున్నారు, ఇందులో చైనాది ముఖ్యమైన పాత్ర ఉంటుంది. సైనిక-సాంకేతిక రంగంలో కూడా చైనా పెద్ద మొత్తంలో సహాయం చేసింది. డిజిటల్ భవిష్యత్తు నిర్మాణానికి చైనా ఇరాన్ యొక్క ప్రధాన భాగస్వామి. ఇటీవల జరిగిన బ్రిక్స్‌ ఫ్యూచర్ నెట్‌వర్క్ ఇన్నోవేషన్ ఫోరమ్ 2026లో ఇరాన్ విశ్వసనీయ కంప్యూటింగ్ పవర్ నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేయడానికి సహకార చట్రాన్‌ని ప్రతిపాదించింది. ఈ కార్యక్రమానికి చైనా పరిశ్రమలు, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ నాయకత్వం వహించింది. ఇరాన్‌లో చైనా ప్రభావ విస్తరణ కేవలం ప్రభుత్వ దౌత్య సంబంధాలకే పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఆర్థిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ భవిష్యత్తు వరకు వ్యాపించి ఉంది. ఇస్లామాబాద్ ఒప్పందం ప్రకటించిన వెంటనే, ఇరాన్ చైనా, రష్యా, ఒమన్‌తో ఉన్నత స్థాయి రాజకీయ సమన్వయాన్ని ఏర్పరచుకుంది. విదేశాంగ మంత్రి అరాగచీ చైనా యొక్క వాంగ్ sమూకి ఒప్పందం వివరాలను తెలియజేస్తూ ఇరాన్-చైనా సంబంధాల వ్యూహాత్మక స్వరూపాన్ని నొక్కి చెప్పారు. రెండు దేశాలు ఇంధనం, వాణిజ్యం పెట్టుబడులలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకునే అవకాశాలపై చర్చించాయి. ఇందులో నుండే పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలీబాఫ్ యొక్క దూరదృష్టి స్పష్టమవుతుంది. ఇదే నేపథ్యంలో ఇరాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ ఉపాధ్యక్షుడు గాదిర్ ఘియాఫే ఇలా నొక్కి చెప్పారు. 2035-2050 నాటికి చైనా ఎక్కడికి చేరుకుంటుందో అర్థం చేసుకుని ఇరాన్-చైనా అభివృద్ధి పత్రాన్ని తయారు చేయాలని ప్రతిపాదించారు. ఇరాన్-చైనా-రష్యా కొత్త వ్యూహాత్మక త్రికోణ కూటమి అమెరికన్ ఆధిపత్యం అంతం కావడానికి ఒక బలమైన సంకేతం. డాలర్ మునుపటిలా ప్రభావవంతంగా లేదు. చైనా-ఇరాన్ వాణిజ్యం యువాన్-రియాల్లో జరగడం ప్రారంభించడంతో బ్రిక్స్‌లో ప్రత్యామ్నాయ కరెన్సీ వ్యవస్థపై చర్చ ప్రారంభమైనందున డాలర్ పట్టు సడలుతోంది. ఇస్లామాబాద్ ఒప్పందంలో అమెరికా ఇరాన్ యొక్క స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయడానికి నౌకాశ్రయాలపై నిషేధాన్ని ముగించడానికి నిబంధనలను అంగీకరించాల్సి వచ్చింది, ఇది ఒక రకంగా వెనక్కి తగ్గడమే. మరోవైపు, షాంఘై సహకార సంస్థ, బ్రిక్స్‌, బెల్ట్ అండ్ రోడ్ వంటి అమెరికా నేతృత్వంలోని నాటో జి-7లకు ప్రత్యామ్నాయంగా నిలిచిన బహుళధ్రువ సంస్థలు బలోపేతం అవుతున్నాయి. ఇరాన్ ఈ సంస్థలన్నింటికీ చురుకైన సభ్యదేశంగా మారింది, బ్రిక్స్‌ ఫ్యూచర్ నెట్‌వర్క్ ఫోరమ్లో చైనా నాయకత్వంలో డిజిటల్ మౌలిక సదుపాయాల రూపకల్పన చేయడం అమెరికన్ సాంకేతిక ఆధిపత్యానికి నేరుగా సవాల్. సైనిక రంగంలో కూడా అమెరికా అజేయత అనే భ్రమ భగ్నమైంది. పాశ్చాత్య సాంకేతికత అంతిమం కాదని చైనా సహకారంతో రుజువైంది. కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ఇజ్రాయెల్ను లెబనాన్‌పై దాడులు ఆపేలా కట్టుబడి ఉండేలా చేయాలనే ఇరాన్ షరతును అంగీకరించాల్సి వచ్చింది, ఇది అమెరికన్ దౌత్యం యొక్క పరిమితులను చూపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రం చైనా. ఏఐ,విద్యుత్ వాహనాలు, క్వాంటం సాంకేతికతలో చైనా ఆధిక్యాన్ని సాధించింది. ఇరాన్ వంటి దేశాలు ఇప్పుడు మూలధనం, సాంకేతికత, భవిష్యత్తు ఉపాధి కోసం అమెరికా వైపు కాకుండా చైనా వైపు చూస్తున్నాయి. మరోవైపు బ్రిక్స్‌ ప్లస్ ద్వారా డిజిటల్ భవిష్యత్తును రూపొందిస్తోంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేంద్రంలో ఉన్న అమెరికా స్థానానికి పెద్ద సవాల్. చైనా స్పష్టంగా చెప్పింది, ఐక్యరాజ్యసమితిలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ల ప్రాతినిధ్యం సరి పోదు. గ్లోబల్ సౌత్ గళాన్ని మరింతగా వినాలి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ sమూ ప్రపంచ పాలనను న్యాయమైనదిగా, సమతుల్యంగా చేయడంపై ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేస్తూ, “చిన్నదైనా పెద్దదైనా, అన్ని దేశాలు అంతర్జాతీయ సమాజంలో సమాన సభ్యులే” అని పేర్కొన్నారు. ఏకధ్రువ ప్రపంచపు కాలం ముగుస్తోంది. అనేక ధ్రువాలతో కూడిన ఒక కొత్త వ్యవస్థ ఆవిర్భవిస్తోందని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. అమెరికా పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవలసి వస్తోంది. కాల్పుల విరమణ తర్వాత 60రోజుల్లో సమగ్ర తుది పరిష్కారాన్ని కనుగొంటామని హామీ ఇవ్వవలసి వస్తోంది. అమెరికన్ ఆధిపత్యం ఇంకా పూర్తిగా చరిత్రలో కలిసిపోలేదు. అయినప్పటికీ ఇరాన్-చైనా-రష్యా ఈ కొత్త వ్యూహాత్మక కూటమి, గ్లోబల్ సౌత్ యొక్క పెరుగుతున్న గళం, బహుళధ్రువ సంస్థల బలోపేతం ఆ ఆధిపత్యపు గోడల్ని బద్దలు కొడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
సంజయ్ పాండే (న్యాయవాది, ఉన్నత న్యాయస్థానం, ముంబై)
సెల్ : 9221633267

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు