Homeజాతీయం40 వేల మంది గల్లంతు

40 వేల మంది గల్లంతు

- Advertisement -

మరుభూమిని తలపిస్తున్న వెనిజులా
భూకంప విపత్తులో 589కి పెరిగిన మృతులు
నాలుగు వేల మందికి పైగా గాయాలు
సోషల్ మీడియాపై ఆంక్షల సడలింపు

కారకాస్: సెకన్ల వ్యవధిలో సంభవించిన రెండు శక్తిమంతమైన భూకంపాలు వెనిజులాను మరుభూమిగా మార్చేశాయి. ఈ ఘోర ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 589 మంది మృతి చెందారని, మరో 4,300 మంది గాయపడినట్లు వెనిజులా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించినప్పటికీ అనధికారికంగా మృతులు వేలల్లో ఉండే అవకాశం ఉంది. ఇంకా అనేక మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోవడంతో సహాయక బృందాలు వారిని వెలికితీసేందుకు కృషిచేస్తున్నాయి. కాగా, ఈ వరుస భూకంపాల అనంతరం దాదాపు 40 వేల మంది ఆచూకీ తెలియడం లేదని వెనిజులా అధికారవర్గాలు తెలిపాయి. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. రాజధాని కారకాస్‌తో పాటు దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో భూప్రకంపనలు సంభవించినప్పటికీ తీర ప్రాంత నగరమైన లా గువేరాలో అత్యధిక నష్టం వాటిల్లింది. భూకంపం ధాటికి అక్కడి పరిస్థితి దయనీయంగా మారింది. లా గువేరాలో 100కు పైగా భవనాలు పూర్తిగా కూలిపోయినట్లు ఐక్యరాజ్యసమితి ప్రతినిధు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించడం, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అత్యంత క్లిష్టంగా మారిందని వారు తెలిపారు. భారీ కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
250 భారీ భవనాలు నేలమట్టం: రోడ్రిగ్స్‌
దేశవ్యాప్తంగా సుమారు 250 బహుళ అంతస్తుల భవనాలు పూర్తిగా నేలమట్టమైనట్లు వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌ తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. కాగా, విపత్తు సమయంలో తమ దేశానికి అండగా నిలిచిన ప్రపంచ దేశాలకు రోడ్రిగ్స్‌ కృతజ్ఞతలు తెలిపారు. మానవతా దృక్పథంతో సహాయక చర్యల్లో భాగస్వాములవుతున్న అన్ని దేశాలకు వెనిజులా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ప్రపంచ దేశాలు చూపుతున్న సంఘీభావం తమకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోందని ఆమె అన్నారు.
భూకంపం అనంతరం సమాచార మార్పిడిని వేగవంతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, సామాజిక మాధ్యమాలపై ఉన్న ఆంక్షలను తొలగించాలని వెనిజులా ప్రభుత్వాన్ని కోరారు. అత్యవసర సమాచారాన్ని ప్రజలకు త్వరగా చేరవేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందని సూచించారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో వెనిజులాలో ‘ఎక్స్‌’ సామాజిక మాధ్యమ వేదికను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024లో అప్పటి ప్రభుత్వం ‘ఎక్స్‌’పై నిషేధం విధించింది.
భారీగా సహాయం: వెనిజులాకు ప్రపంచదేశాల నుండి భారీగా సహాయం అందుతోంది. అమెరికా 150 మిలియన్ డాలర్ల విలువైన సహాయక సామగ్రిని పంపనున్నట్లు ప్రకటించింది. ఇందుకో సం రెండు యుద్ధ నౌకలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లను సిద్ధం చేసినట్లు తెలిపింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, మెకిస్కో, బ్రెజిల్ తదితర దేశాలు కూడా వైద్య బృందాలు, సహాయక సిబ్బంది, అత్యవసర సామగ్రిని పంపేం దుకు ముందుకొచ్చాయి. భూకంప ప్రభావిత ప్రాం తాల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతు న్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని సజీవంగా రక్షించేం దుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తు న్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షి స్తున్న ప్రభుత్వం, బాధితులకు అవసరమైన అన్ని విధాల సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపడుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు