Homeజాతీయంఅసోంలో 5 గ్యారంటీలు

అసోంలో 5 గ్యారంటీలు

- Advertisement -

ఎన్నికల హామీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ప్రకటన

నావోబోయిచా(అసోం): ఎన్నికల హామీల్లో భాగంగా అసోం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలను ప్రకటించింది. తెలంగాణలో ఆరు గ్యారంటీలు ప్రకటించి అధికారం సాధించిన కాంగ్రెస్ పార్టీ… తాజా ఎన్నికల్లో అసోంలో ఐదు గ్యారంటీలతో ప్రజల ముందుకు వెళుతోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే వీటిని ఆదివారం నావోబోయిచాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో విడుదల చేశారు. ఇవీ ఐదు గ్యారంటీలు…

  1. ప్రతి మహిళకు నెలనెలా ఆర్థిక సాయం. వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే, విస్తరించాలనుకునే మహిళలకు ఒకేసారి రూ.వేలు సాయం.
  2. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా.
  3. 10 లక్షల మందికి శాశ్వత భూపట్టాల పంపిణీ.
  4. సీనియర్ సిటిజన్లను నెలకు రూ.1,250.
  5. 100 రోజుల్లో ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ అనుమానాస్పద మరణం కేసు పరిష్కారం.
    దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ, తూర్పు కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్‌ల ఇదే తరహా హామీలతో అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఖడ్గే మాట్లాడుతూ తమ పార్టీ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ఖచ్చితంగా అమలు చేస్తోందని చెప్పారు. అసోంలోనూ తప్పకుండా అమలు చేస్తామని ఈ సందర్భంగా ఖడ్గే తెలిపారు. అసోంలో అధికార బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన ఒక కుటుంబానికే రాష్ట్రంలో 12,000 బిగాల భూమి (3,960 ఎకరాలు) ఉందని విమర్శించారు. ముఖ్య మంత్రి హిమంత శర్మపై పరోక్ష విమర్శలు చేశారు. ప్రభుత్వ భూములను అదానీ, రాందేవ్‌లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ పార్టీ పని చేస్తోందన్నారు. తమ పార్టీపై అసోం ప్రజలకు నమ్మకం ఉందని, ఈ సారి అసోంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు తమ పార్టీని ఆదరించి అధికారంలోకి తీసుకురావాలని కోరారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు