Wednesday, December 11, 2024
Homeజిల్లాలుఘనంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు..

ఘనంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు..

గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గ్రంధాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి, పాఠకులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ ఈ గ్రంథాలయ వారోత్సవాలు 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఏడు రోజులపాటు నిర్వహించబడునని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తామని, ఇందులో భాగంగా జూనియర్ విభాగంలో ఆరవ, ఏడవ, తరగతి లకు, అదేవిధంగా సీనియర్ విభాగములో ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ తరగతి లకు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ పోటీలలో మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఈనెల 20వ తేదీన బహుమతులను అందజేస్తామని తెలిపారు. తదుపరి 14వ తేదీన బాలల దినోత్సవం, 15న పుస్తక ప్రదర్శన, 16న గ్రంథాలయ ఉద్యమాల్లో పాల్గొన్న ప్రముఖులు, 17న కవి సమ్మేళనం, 18న చిత్రలేఖనం, 19న ఉమెన్స్ డే ,20న గ్రంథాలయ డే ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున విద్యార్థులు పాఠకులు పాఠశాల ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రమణ నాయక్ ,సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్ లతోపాటు పాఠకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు