Tuesday, December 10, 2024
Homeజిల్లాలుగ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా) : స్థానిక శాఖా గ్రంథాలయములో గురువారం గ్రంథాలయాధికారి బి.రవి కుమార్ నాయుడు ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, నెహ్రూ జయంతి, పిల్లల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ నాగరాజు హాజరయ్యారు. మొదటగా ఎంఈఓ నాగరాజు నెహ్రూ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ నాగరాజు మాట్లాడుతూ నెహ్రు భారతదేశ తొలి ప్రధాని, నెహ్రు దేశానికి చేసిన సేవలను గూర్చి పిల్లలకు వివరించి చెప్పారు. నేటి పిల్లలే రేపటి దేశానికి నిజమైన శక్తి స్వరూపాలని తెలిపారు. అనంతరం పిల్లలతో గ్రంథాలయ ప్రతిజ్ఞ చేయించి, విద్యార్థినీ, విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల తెలుగు పండిట్ కే. శివరామిరెడ్డి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు వి. సూర్యనారాయణ రెడ్డి రిటైర్డ్ ఉపాధ్యాయులు వీరారెడ్డి ప్రభుత్వ గవర్నమెంటు హైస్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రంథాలయ పాఠకులు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు