విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని ఓబులాయన పల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో స్థానిక నివాసితురాలు అనిత ఇంట్లో తీవ్రమైన నష్టం సంభవించింది. దీంతో ఆ ఘటనపై స్పందించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. దీంతో డిప్యూటీ ఎమ్మార్వో సురేష్ బాబు మంత్రి ఆదేశాల మేరకు ఆ కుటుంబం వద్దకు వెళ్లి నిత్యవసర సరుకులను హుటాహుటిన అందజేశారు. అంతేకాకుండా అనిత కుమార్తె ఇంజనీరింగ్ పూర్తి చేసిన సంగతి తెలుసుకున్న మంత్రి ఆమెకు తగిన ఉద్యోగ అవకాశాన్ని కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. దీంతో అక్కడి కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తదుపరి మంత్రికి ఆ కాలనీ ప్రజలు కృతజ్ఞతలను తెలియజేశారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మానవీయంగా స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
RELATED ARTICLES