- Advertisement -
ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం:: పాలిసెట్ దరఖాస్తుకు ఈనెల 30వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షకు హాజరైన వారు ఇదివరకే పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు అందరూ కూడా అర్హులని తెలిపారు. దరఖాస్తు రుసుము బి సి, ఓ సి వారికి 400 రూపాయలు ఎస్సీ, ఎస్టీ వారికి కేవలం 100 రూపాయలు మాత్రమే ఉంటుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


