విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విజయకేతనం ఎగురవేసిందని పాఠశాల ఫౌండర్ శెట్టిపి రామిరెడ్డి, కరెస్పాండెంట్ ఎస్. నిర్మలాదేవి, డైరెక్టర్లు శెట్టిపి సూర్య ప్రకాశ్ రెడ్డి, శెట్టిపి పద్మలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతిలో 68 మందికి 68 మంది విద్యార్థులు మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత కావడం జరిగిందని తెలిపారు. 595 మార్కులతో వి. విష్ణు ప్రథమ స్థానం, 590 మార్కులతో టీ. లిఖిత ద్వితీయ స్థానం, 584 మార్కులతో ఎం. హాసిని తృతీయ స్థానం సాధించడం జరిగిందన్నారు. ధర్మవరం పట్టణంలోనే కాక శ్రీ సత్యసాయి జిల్లాలో ఏకైక పాఠశాలగా నిలవడం గొప్ప విజయము అని అభివర్ణించారు. అంతేకాకుండా 500 పైగా మార్కులు 44 మంది విద్యార్థులు సాధించడం విశేషం అని తెలిపారు. తదుపరి కరెస్పాండెంట్, డైరెక్టర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కాకతీయ విద్యా నికేతన్ పాఠశాల విజయకేతనం
- Advertisement -
RELATED ARTICLES


