Homeజిల్లాలుఅనంతపురంఅనంత జిల్లా సాగునీటి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి దరూర్ పుల్లయ్య

అనంత జిల్లా సాగునీటి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి దరూర్ పుల్లయ్య

- Advertisement -

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్

విశాలాంధ్ర -అనంతపురం : అనంత జిల్లా సాగునీటి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి దరూర్ పుల్లయ్య అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ పేర్కొన్నారు. మంగళవారం మాజీ పార్లమెంట్ సభ్యులు దరూర్ పుల్లయ్య పార్థివ దేహాన్ని బళ్లారిలో ఆయన స్వగృహంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ రాష్ట్ర పార్టీ తరపున పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ…. అనంతపురం జిల్లాలో సాగునీటి కోసం పుల్లయ్య అహర్నిశలు కృషి చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడానికి ఎన్నో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఆయన అన్ని రాజకీయ పార్టీలను రైతు సంఘాలను సమన్వయం చేసుకొని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయుటకు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బళ్లారి జిల్లా యువజన సమాఖ్య అధ్యక్షులు బసప్ప, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు