విశాలాంధ్ర -ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ,ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవతో ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరయ్యాయి అని ఎన్ డి ఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం మార్గంలో రూ.4.30 కోట్ల నిధులు కేటాయించబడ్డాయి అని, ఈ నిధుల రూ.1.29 కోట్లు – ఘన వ్యర్థాల నిర్వహణకు,రూ.1.29 కోట్లు – తాగునీటి సరఫరా మెరుగుదలకు,రూ.1.72 కోట్లు – మునిసిపాలిటీ సాధారణ అభివృద్ధి పనులకు కేటాయించబడ్డాయి అని తెలిపారు.ప్రజలకు మౌలిక వసతుల కల్పన, శుభ్రత, ఆరోగ్య భద్రత పరంగా నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా మంత్రివర్యులు శ్రద్ధ వహిస్తున్న విషయం ప్రత్యేకంగా పేర్కొనదగ్గది అని తెలిపారు. ఈ నిధుల ద్వారా పట్టణ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ముఖ్య లక్ష్యం అని తెలిపారు. ఈ సందర్భంలో ధర్మవరం ప్రజలు రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి దిశగా ఆయన చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపారు.
ధర్మవరం మునిసిపాలిటీ అభివృద్ధికి రూ.4.30 కోట్ల నిధుల మంజూరు
RELATED ARTICLES