శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత 111వ వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం నిర్వాహకులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉచిత వైద్య చికిత్సలతో పాటు నెలకు సరిపడు మందులను కూడా ఉచితంగా ఇవ్వబడునని తెలిపారు. ప్రత్యేక నిష్ణాతులైన వైద్యులైన డాక్టర్ వివేకులాయప్ప ,డాక్టర్ వెంకటేశ్వరలు, డాక్టర్ డివి జైదీపునేత, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ విట్టల్, డాక్టర్ సాయి శ్వేతాచే వైద్య చికిత్సలను అందించబడునని తెలిపారు. ఈ శిబిరం యొక్క దాతగా కీర్తిశేషులు చింతా లక్ష్మీనరసమ్మ, కీర్తిశేషులు చింత రామకృష్ణ జ్ఞాపకార్థం వీరి కుమారులు చింతా వెంకట రంగయ్య ,చింతా కృష్ణమూర్తి వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ శిబిరంలో బిపి, షుగర్ లు కూడా వైద్య చికిత్సలు అందించబడునని తెలిపారు. వృద్ధులకు, చిన్న, పెద్ద వయసు గల వారికి కూడా ఈ శిబిరం ఎంతో ఉపయోగపడడానికి తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ, గ్రామీణ పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
111వ ఉచిత వైద్య చికిత్స శిబిరం ను సద్వినియోగం చేసుకోండి..
RELATED ARTICLES