Sunday, June 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిడిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాల నందు టౌన్ ఫస్ట్ శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల

డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాల నందు టౌన్ ఫస్ట్ శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల

విశాలాంధ్ర ధర్మవరం; డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలనందు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల ప్రభంజనం సృష్టించిందని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్, కళాశాల ఇన్చార్జి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం నాడు కళాశాలలో విద్యార్థులతో కలిసి కేకును కట్ చేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీకాం నందు కళాశాల విద్యార్థిని జీ. పావని 97.5 శాతము, బీఎస్సీ నందు జయచంద్రిక 90 శాతముతో టౌన్ ఫస్ట్ ర్యాంకులను సాధించారని వారు తెలిపారు. అలాగే జ్యోతిక 96 శాతముతో టౌన్ సెకండ్ ర్యాంకు, తనూజ మరియు షాఫియా 93 శాతముతో టౌన్ థర్డ్ ర్యాంకును సాధించారని తెలిపారు. అదేవిధంగా బీకాం నందు భావన 92 శాతము, లోకనాథ్ 92 శాతము, ప్రీతి 90 శాతము, బుషారా 90 శాతము, సాదియా భాను 90 శాతము, తదుపరి బీఎస్సీ గ్రూపు నందు మధుశాలిని 88 శాతము, అమృత సాయి 87 శాతము, లావణ్య 85 శాతము, రవితేజ 85 శాతము, మణికంఠ 84 శాతము, ప్రత్యూష 81 శాతము, బీబీఏ నందు రాజేష్ 80 శాతము తో పట్టణంలోనే అగ్రగామి సంస్థగా మరొక్కమారు నిరూపించుకున్నదని, ఇంతటి విజయానికి కారణమైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి కళాశాల యాజమాన్యం తరపున హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు కృష్ణయ్య, శ్రీనివాసులు,జయకృష్ణ,శిరీష తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు